పబ్జీ, లూడో కింగ్ లాంటి 47 యాప్స్ ను బ్యాన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 27, 2020

పబ్జీ, లూడో కింగ్ లాంటి 47 యాప్స్ ను బ్యాన్


భారత ప్రభుత్వం చైనా దేశ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టేందుకు అడుగులు వేస్తోంది. చైనాకు తాజాగా భారత్ మరో భారీ షాకిచ్చింది. ఇప్పటికే టిక్‌టాక్, హెలో సహా 59 చైనా యాప్స్‌ని భారత ప్రభుత్వం నిషేధించింది. తాజాగా భారత్ ఇప్పుడు మరో 47యాప్స్ బ్యాన్ చేసింది. పబ్జీ, లూడో కింగ్ లాంటి 47 యాప్స్ ను బ్యాన్ చేసినట్టు చెబుతున్నారు. ఇంతకు ముందు నిషేధించిన 59 యాప్‌ లకు క్లోన్‌ లుగా ఈ 47 పనిచేస్తున్నాయని ఇండియా గుర్తించింది. టిక్ టాక్ నిషేధంతో ఆ సంస్థకు భారీగా నష్టం చేకూరుతోంది. భారత ప్రభుత్వం తాజాగా నిషేధించిన 47 చైనా యాప్ ల జాబితా త్వరలో విడుదల అవుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ టెలికాం శాఖ, ఐటీ నిపుణులు చైనాకు చెందిన యాప్స్, వాటి డేటా, భారత పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతున్న అంశాలపై పరిశోధించారు. చైనాకు చెందిన వివిధ యాప్స్, పాపులర్ గేమింగ్ యాప్స్ అయిన పబ్‌జీ మొబైల్, లూడో వాల్డ్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అలీ ఎక్స్‌ప్రెస్ లాంటివి ఉండే అవకాశం ఉన్నాయి.గాల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి అనంతరం చైనా వస్తువులు, యాప్స్, స్మార్ట్‌ఫోన్లు నిషేధించాలన్న డిమాండ్లు వచ్చాయి.అదీ కాక ఇన్ఫర్మేషన్ లీక్ అవుతోందని గుర్తించిన భారత నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనా మూలాలున్న 59 యాప్స్‌ని నిషేధించింది. తాజాగా మరిన్ని ఈ జాబితాలో వుండడం, మోస్ట్ పాపులర్ పబ్ జి కూడా నిషేధించేందుకు రంగం సిద్ధమయింది.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad