రాజ్‌భవన్‌ పోలీసు సిబ్బందిలో 48 మందికి పాజిటివ్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 13, 2020

రాజ్‌భవన్‌ పోలీసు సిబ్బందిలో 48 మందికి పాజిటివ్‌


శుభ తెలంగాణ , హైదరాబాద్ :  రాజ్‌భవన్‌లో 38 మంది సిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణైం ది. గవర్నర్‌కు నెగెటివ్‌ అని తేలింది. రాజ్‌భవన్‌లో విధులు నిర్వహిస్తున్న 28 మంది స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌ సిబ్బంది, 10 మంది ఉద్యోగులు, మ రో 10 మంది వారి కుటుంబసభ్యులు కరోనా బారి నపడినట్టు రాజ్‌భవన్‌ స చివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రాజ్‌భవన్‌ పోలీసు సిబ్బందిలో కొందరు కరోనా బారినపడడంతో గవర్నర్‌ తమిళిసై చొరవ తీసుకుని రెండ్రో జులుగా రాజ్‌భవన్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీ క్షలు చేయించారు. తాను కూడా పరీక్ష చేయించుకున్నారు. 395 మందికి పరీక్షలు నిర్వహించగా, 347 మందికి నెగెటివ్, 48 మందికి పాజిటివ్‌ వచ్చింది. గవర్నర్‌కు కరోనా సోకలేదని పరీక్షల్లో తేలింది.