తెలంగాణలో భూకంపం... రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 03, 2020

తెలంగాణలో భూకంపం... రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత..

తెలంగాణలో గురువారం(జూలై 2) సాయంత్రం 6.30గం. సమయంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు తెలిపింది.
భూకంప కేంద్రం హైదరాబాద్‌కు నైరుతి దిశగా 107కి.మీ దూరంలో,ఉపరితలం నుంచి 10కి.మీ లోతులో ఉన్నట్లు తెలిపింది. అయితే స్థానికంగా మాత్రం భూకంపానికి సంబంధించి ఎక్కడా,ఎటువంటి వార్తలు గానీ,ప్రచారం గానీ లేకపోవడం గమనార్హం.మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతం లదాఖ్‌లోనూ వాయువ్య దిశగా 119కి.మీ దూరంలోని కార్గిల్‌లో గురువారం మధ్యాహ్నం భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉపరితలం నుంచి 90కి.మీ లోతులతో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపారు.