6800 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ఎం41 స్మార్ట్ ఫోన్...? - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 20, 2020

6800 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ ఎం41 స్మార్ట్ ఫోన్...?


కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధించిన పలు దేశాలు.. ఎలాంటి ప్రయోజనం లేక అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ క్రమంలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా విడుదలకు నోచుకోని ఫోన్లును.. అన్‌లాక్ ప్రారంభం అవ్వగానే వరుసపెట్టి లాంచ్ చేస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ల తయారీదారయని శాంసంగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రాబోతున్నట్టు తెలుస్తోంది. అదే శాంసంగ్ గెలాక్సీ ఎం41 స్మార్ట్ ఫోన్. తాజాగా చైనా 3సీ సర్టిఫికేషన్ సైట్ లో EB-BM415ABY అనే మోడల్ నంబర్ తో దర్శనమిచ్చింది. ఇదే మోడల్ నంబర్ సేఫ్టీ కొరియా సైట్ లో కూడా కనిపించింది. వీటి ప్రకారం చూస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎం41 స్మార్ట్ ఫోన్ 6800 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అవ్వనుంది. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఎక్సినోస్ 9630 ప్రాసెసర్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎం41 స్మార్ట్ ఫోన్ పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండవచ్చని అంటున్నారు. అందులో ప్రధాన కెమెరా 64 మెగా పిక్సెల్ కాగా.. 12 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లు ఇందులో ఉండనున్నాయని సమాచారం. అలాగే ఇందులో 6 జీబీ ర్యామ్ కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక గత ఏడాది శాంసంగ్ లాంచ్ చేసిన గెలాక్సీ ఎం40 స్మార్ట్ ఫోన్ కు తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం40లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ను అందించారు. రూ.15,999 ధరతో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. దీనిని బట్టీ చూస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎం41 స్మార్ట్ ఫోన్ ధర దాదాపు రూ.20 వేలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ ఫోన్ ఇప్పటికే కావాల్సిన సర్టిఫికేషన్లను పొందినప్పటికీ శాంసంగ్ దీని లాంచ్ ను కొన్ని రోజులు వాయిదా వేయనున్నట్టు సమాచారం. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )