సిద్దిపేట జూలై 08(శుభ తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతు కండ్లలో ఆనంద భాష్పాలు వస్తుంటే.. కాంగ్రెస్ నాయకుల కండ్లలో కనీళ్లు వస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతులకు అనేక సంక్షే మ, అభివృద్ది కార్యక్రమాలు జరు గుతుంటే వారు తట్టుకోలేక పోతు న్నారని మండిపడ్డారు. జిల్లాలోని కొండపాక మండలం కుకునూరు పల్లిలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నా రు. కుకునూరుపల్లి రాజీవ్ రహదారి పై డివైడర్, రోడ్డుకు ఇరువైపులా 1200 మొక్కలు నాటడమే లక్ష్యంగా చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్లో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిసి జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ప్రారం భించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వా నికి మంచి పేరు వస్తుండటంతో ఏదో ఒకటి చేయాలని కాంగ్రెస్ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజల మధ్యన ఉండి మేం మాట్లాడుతున్నాం గాంధీ భవన్లో కూర్చుని వారు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మేం ప్రజలకు సేవకులుగా పని చేస్తున్నాం. కరోనా వచ్చిందని జనానికి ధైర్యం చెప్పి, జనం మధ్యలోనే ఉ ంటున్నామని మంత్రి పేర్కొన్నారు. 70 ఏండ్లు కాంగ్రెస్, టీడీపీలు పరిపాలనలో చేయని పనిని ఆరేండ్లలో టీఆర్ఎస్ చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని తెలిపారు. అలాగే చెట్లు నాటడం మనందరి బాధ్యతన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా చెట్లు నాటాలని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణను హరిత తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి వెంట ఎప్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.