తెలంగాణ లో 99 శాతం కరోన రికవరీ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 15, 2020

తెలంగాణ లో 99 శాతం కరోన రికవరీ


హైదరాబాద్‌, జూలై 14(శుభ తెలంగాణ): తెలంగాణలో 80 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 9,786 మంది హోం ఐసోలేషన్‌ లో ఉన్నారు..కరోనా ట్రీట్మెంట్‌ విషయంలో డి సెంట్రలైజ్‌ చేశార న్నారు. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో కూదా కరోనా ట్రీట్మెంట్‌ ఉచితం గా జరగనుందని చెప్పారు. 54 ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్‌ జరుగుతుంది... 98 ఆస్పత్రులకు అనుమతి ఉందన్నారు. తెలంగాణ లో గత పది రోజులుగా కరోనా నిర్దారణ పరీక్షలు పెంచామని శ్రీని వాసరావు తెలిపారు. తెలంగాణలో కరోనా నియంత్రణకు సంబంధిం చి మంగళవారంఆయనమిడియా తో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇప్పటివరకు 36,221 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపా రు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో సోమవారం ఒక్క రోజే 11,525 కరోనా నిర్జా రణ పరీక్షలు చేశామని పేర్కొన్నా రు. దేశంలో కరోనా మరణాల రేటు 2.7 శాతం ఉంటే... తెలం గాణలో ఒక్క శాతమే ఉందన్నారు. తెలంగాణలో 365 మంది కరోనా తో మరణించారని వెల్లడించారు. తెలంగాణలో రికవరీ రేటు 99 శాతం ఉందని శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణలో 80 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని చెప్పారు. 9,786 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 ఆస్పత్రు ల్లో కరోనా టెస్టులు జరుగుతున్నాయని వెల్లడించారు.