తెలంగాణా కొత్త సచివాలయం కొత్త డిజైన్ ఇదే .. ఆరు అంతస్తులలో అన్ని హంగులతో .. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 07, 2020

తెలంగాణా కొత్త సచివాలయం కొత్త డిజైన్ ఇదే .. ఆరు అంతస్తులలో అన్ని హంగులతో ..

తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయం నిర్మాణం విషయంలో దూకుడు పెంచింది. పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ను తయారు చేసింది. ఆరు అంతస్తులతో కొత్త తెలంగాణ సచివాలయాన్ని అందంగా తీర్చి దిద్దింది. దీనికి సంబంధించిన డిజైన్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఏడాదిలోగా కొత్త సచివాలయం నిర్మాణం పూర్తిచేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా త్వరలోనే ఆరంతస్తుల భవనం గా నిర్మితమవుతున్న కొత్త సచివాలయం డిజైన్ కు ఆమోద ముద్ర వేయనున్నారు. ఆయన ఆమోదముద్ర వేయగానే కొత్త సచివాలయం నిర్మాణం మొదలవుతుంది. కోర్టు కొత్త సచివాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో నేటి నుండి పాత సచివాలయం కూల్చివేత పనులు మొదలుపెట్టిన తెలంగాణ సర్కార్ కూల్చివేతను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.