గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే పర్మనెంట్‌ చెయ్యాలని ...- సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎన్‌ సబిత... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 15, 2020

గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే పర్మనెంట్‌ చెయ్యాలని ...- సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎన్‌ సబిత...


మేడ్చల్ జిల్లా , ‌  జూలై 15(శుభ తెలంగాణ): కరోనా ఇబ్బందుల్లో తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మొత్తం పౌరసమాజానికి  నిరంతరం సేవలందిస్తున్న గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే పర్మనెంట్‌ చెయ్యాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎన్‌ సబిత  డిమాండ్‌ చేశారు. ఘట్మేసర్‌  మండలం కాచవాని సింగారం,  ప్రతాప్‌ సింగారం గ్రామాల్లో బుధవారం ఆమె పర్యటించి  కరోనా లో పంచాయతీ కార్మికులు  ఎదుర్కొంటున్న సమస్యలు ఆమే  అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఎన్‌ సబిత  మాట్లాడుతూ కరోనా వైరస్‌ తో  ప్రజలు ఇబ్బందులు పడుతున్న  సందర్భములో అకాల వర్షాలకు నానుతూ గ్రామాలను పరిశుభ్రముగా ఉంచుతూ అన్ని రకాల సేవలందిస్తున్నారని అన్నార. పారిశుధ్య కార్మికుల గురించి సామాజిక మాధ్యమాలలో పొగుడుతున్నారని దాని ద్వారా వారికి కడుపు నిండదని ప్రభుత్వం చాలా ఏండ్లుగా  వెట్టిచాకిరి చేపించుకుంటుందన్నారు. ప్రభుత్వం కనీస వేతనం తక్షణమే అమలు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని  చెప్పారు. సీఎం గిఫ్ట్‌ ఐదు వేల  రూపాయలు ఇంకా అందరూ కార్మికులకు అండలేదన్నారు.  వెంటనే పిఎఫ్‌ ఈఏస్‌ఐ సౌకర్యం  కల్పించాలని డిమాండ్‌ చేశారు. 11 గ్రామాలలో సమావేశాలు నిర్వహించినట్లు ఆమే తెలిపారు. ఈ సమావేశాలలో గ్రామ పంచాయతి వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఆర్‌ నర్సింహా,ముత్తమ్మమల్లేష్‌ ఎల్లమ్మ,శోభ, లక్ష్మమ్మ, ఐలమ్మ, అశోక్‌, సుకన్య, గంగమ్మ, అరుణ లావణ్య జగన్‌ తదితరులు పాల్గొన్నారు.