ప్రజల ఆరోగ్యమే నాకు ముఖ్యం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 28, 2020

ప్రజల ఆరోగ్యమే నాకు ముఖ్యం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు


మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి (శుభ తెలంగాణ) : కేటీఆర్ జన్మదీన సందర్భంగా ప్రజాలకు ఉపయోగ పడే విధంగా కరోన వైరస్ పెరుగుతున్న తరుణంలో ఎమ్మెల్యే మాధవరం కృ్ణారావు కూకట్ పల్లి నియోజకవర్గానికి తన సొంత నిధులతో అత్యాధునిక సదు పాయాలతో కూడిన అంబులెన్స్ కొరకు 22 లక్షల రూపాయల చెక్కును 0 మంత్రి కేటీఆర్ కి అందజేసారు. ఇదే స్ఫూర్తితో దండమూరి ఎస్టేట్స్ వారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో వారు కూడా కూకట్పల్లి నియోజకవర్గానికి మరొక 22 లక్షల రూపాయల చెక్కును అంబులెన్స్ కొరకు కేటీఆర్ కి అందించడం జరిగింది.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ప్రజారోగ్యమే పరమావధిగాముందుకు వెళ్తూ.. కెసిఆర్, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారని.. ఆపదలో నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నారని.. నా వంతు సహాయంగా మా కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలకు.. ఈ అంబులెన్స్ లు రెండు ఇస్తున్నట్టు ఇవి ఎప్పుడూ కూడా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు