కొత్త సచివాలయ నిర్మాణం పై లోల్లెందుకు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 09, 2020

కొత్త సచివాలయ నిర్మాణం పై లోల్లెందుకు


హైదరాబాద్‌ ప్రతినిధి, జూలై 08(శుభ తెలంగాణ): సచివాలయం అంటే పరిపాలనకు గుండెకాయలాంటిది. అక్కడి నుంచే ముఖ్యమంత్రి, మంత్రులు పాలన చేయాలి.వారికి అందు బాటులోనే అధికారుల కార్యాల యాలు ఉండాలి. అప్పుడే పాలన సజావుగా సాగుతుంది. అలాగే కార్యాలయాలనేవి ప్రశాంతం వాతావరణానికి కేంద్రంగా ఉండాలి. ఓ కార్పోరేట్‌ ఆఫీస్‌కు వెళితే ఎంత కుదురుగా ఉంటుం దో సచివాలయం కూడా అంతే కుదురుగా ఉండాలి. మంత్రి ఒక దగ్గర..ఆయన అధికారులు మరో దగ్గర.. కార్యాలయాలు ఇంకో దగ్గర ఇలా విసిరేసినట్లు ఉండరా దు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం అన్నది ఓ పద్దతి లేకుండా నిర్మించారు. అడపా దడపా మధ్య మధ్యలో నిర్మాణాలు చేపట్టడం... అక్కడో భవనం ఇక్కడో భవనం అన్నట్లుగా విసిరేసినట్లు ఉండేది. ఇంతచేసినా ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఒకచోట ఉండేవి కాదు. సచివాలయంలో పనుల కోసం వచ్చిన వారు మళ్లీ ఏ విద్యా శాఖకో లేదా ఇతర శాఖల అధికారుల కోసమో సచి వాలయం దాటి పోవాల్సి వచ్చేది. ఇవన్నీ ప్రతి ఒక్కరికి అనుభవాలే. సచివాలయంలో అన్నింటికి మించి చక్కటి వాతావరణం ఉ ౦డేది కాదు. నిజాం కాలంలో నిర్మించిన సచివాలయం వేరు.. ఆ తరవాత వచ్చిన అనేకానేక కట్టడాలు వేరు. వాటి రిపేర్లకే ఏటా కోట్లు తగుల బెట్టేవారు. కొందరు కాంట్రాక్టర్లు నిత్యం ఈ పనుల్లోనే ఉండేవారు. అన్నింటికి మించి తగిన పార్కింగ్‌ ఏర్పాట్లు లేవు. రక్షణ వ్యవస్థ అస్స లు సరిగా లేదు.సిఎం కార్యాల యంలో అగ్నిప్రమాదం లాంటిది జరిగితే ఇక అంతే సంగతులు. అలాంటి సచివాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయా ముఖ్యమం త్రులు కోట్లు వెచ్చించి చాంబర్లు బాగుచేయించుకుని ప్రజాధనం వృధా చేశారు. కొత్తగా బిల్జింగ్‌లు కట్టి కోట్లు మింగేశారు. ఇవన్నీ కాదనలేని నిజాలు.రిపేర్లు, సున్నా లు వేయడం. లీకేజీలు అరికట్ట దం, విద్యుత్‌ లైన్లు మార్చడం... ఇతర మెయింటెన్స్‌ల లెక్కలు తీస్తే వందల కోట్లు వృధా చేసి ఉంటా రు. నగరం నడిబొడ్డున విశాలమై న స్థలలో సచివాలయం ఉన్నా ఓ పద్దతి లేకుండా ఉన్నదన్నది ఎవరైనా అంగీకరించాల్సిందే. అలాంటి సచివాలయాన్ని మార్చి, అన్ని హంగులతో... అధునాతన పద్దతులతో నిర్మించాలన్న సంకల్పం సిఎం కెసిఆర్‌ తలపెట్టి ఏళ్లు అవుతోంది. తెలంగాణ ఆవిర్భావ తొలిదశల్లోనే ఆయన ఈ ప్రకటన చేశారు. ఉన్న భవ నాన్ని కూల్చకుండా కొత్తగా స్థలం కోసం అన్వేషించారు. పరేడ్‌ (గ్రౌండ్స్‌ వద్ద ఉన్న బైసన్‌ పోలో జాగాను ఇవ్వాల్సిందిగా కేంద్రం చుట్టూ తిరిగితిరిగి వేసారారు. అయినా కేంద్రం నాన్చిందే తప్ప సమా ధానం ఇవ్వలేదు. ఈ దశలో గతేడాది సిఎం కెసిఆర్‌ ఓ ధృడ నిర్ణయం తీసుకుని పాత సచివాల యాన్ని పూర్తిగా తొలగించి కొత్తగా అధునాత సచివాలయ నిర్మాణం కోసం సిద్దమయ్యారు. శంకుస్థాప న చేశారు. అయితే పలువురు కోర్టుల్లో కేసుల వేసి అడ్డుకున్నా చివరకు హైకోర్టు (ప్రభుత్వ సంకాల్పాన్ని బలపర్చి కేసులను కొట్టేయడంతో అను కున్న మేరకు అధునాతన సచివా లయానికి బీజం పడింది. ప్రస్తుతం పాత సచివాలయ భవనాన్ని కూల్చేసి దాని స్థానంలోనే అన్ని హంగుల తో సమీకృత నూతన సచివాలయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. (థావణ శుద్ధ పంచమి అంటే జూలై 25 లేదా రాఖీ పౌర్ణిమ అల ఆగస్టు 3న కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణ పనులు ప్రారంభించ నున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్త భవన నిర్మాణాన్ని ఏదాది నుంచి ఏడాదిన్నర పూర్తి చేయాల ని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఆరు లక్షల చదరపు అడుగుల్లో నూతన సచివాలయం నిర్మాణం జరగనుం ది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల సమావేశాలకు కోసం అధునాతన హాల్స్‌ దీనికోసం నిర్మించనున్నారు. మంత్రుల పేషీ ల్లోనే ఆయా శాఖల సెక్షన్‌ ఆఫీసులను ఏర్పాటు చేయ బోతున్నారు. ఇవన్నీ ఒకే చోటకు రానున్నాయి. ఇప్పటికే నగరంలో పలుచోట్ల విసిరేసినట్లుగా ఉన్న అనేక కార్యాలయాలు ఇక సచివాలయంలో శాశ్వతంగా ఉండిపోనున్నాయి. పలుచోట్ల లక్షల్లో అద్దె చెల్లిస్తూ అనేక కార్యా లయాలను నిర్వహిస్తున్నారు. కొత్త సచివాలయం రాకతో ఈ బెడదా తప్పనుంది. సచివాలయంలోకి ప్రేశిస్తే అన్ని పనులను చక్కబెట్టు కుని వచ్చేలా అన్ని శాఖలు ఇక్కడే కొలువు దీరనున్నాయి. ఇప్పటి వరకు ప్రస్తుత సచివాలయంలో అనేక శాఖలు బయట ఉండడం వల్ల అధికారులను ఏదైనా సమా వేశానికి ముఖ్యమంత్రి లేదా మంత్రి పిలిస్తే ఆ రోజంతా సమయం వృధా అయ్యేది. కార్యాలయానికి వెళ్లిన ప్రజలకు అధికారి లేకపోవడంతో ఆ రోజం తా పడిగాపులు పడాల్సి వచ్చేది. ఇకపోతే సమికృత భవనం కనుక ప్రభుత్వం కూడా ముందుముందు మరిన్ని శాఖలకు లేదా కొత్తగా ఏర్పడే శాఖలకు అవసరమైన కార్యాలయాలకు అనువుగా కొత్త సచివాలయం నిర్మించాలి.రానున్న కాలంలో మరింతగా కార్యాలయ అవసరాలు పెరగనున్నాయి. అలాంటి అవసరాలను మరో వందేళ్లయినా తీర్చేలా ప్రస్తుత డిజైన్సనలు పరిశీలించుకోవాలి. నూతన సచివాలయ భవన నిర్మా ణ కోసం10 కంపెనీలు నమూనా లను,పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్ల ను ప్రభుత్వానికి సమర్ప్చించాయని తెలుస్తోంది. ఈ సమయంలో సచివాలయం బయట ఉంటున్న వివిధ ప్రభుత్వ శాఖల కార్యాల యాలు, సిబ్బందిని లెక్కలోకి తీసుకుని మరింత జాగ్రత్తగా ప్లాన్‌ రూపొందించాలి. అన్ని ఆధునిక హంగులతో నిర్మించబోయే కొత్త సచివాలయం కాబట్టి భవిష్యత్‌లో ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకోవాలి. అవసరమైతే గతంలో పనిచేసిన విశ్రాంత ఐఎఎస్‌ల సూచనలు,సలహాలు కూడా స్వీకరించడంలో తప్పు లేదు.కొత్త భవన ముఖ ద్వారం తూర్పువైపుగా ఉండి,ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉండేలా ఈ నిర్మాణం జరగ నుంది. భవనం మధ్యలో చెట్టు, పచ్చికబయళ్లతో కూడిన రెండు పెద్ద వరండాలు లోపల వెలువడే కర్చన వ్యర్థాలను తగ్గించే విధంగా ఉంటాయి. హుస్సేన్‌సాగర్‌ మోదుగా వీచే గాలులు లోపలికి ప్రవేశించి భవనం ఎల్లప్పుడూ చల్లగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా డిజైన్లు రూపొందించారు. మరో పదేళ్లయినా ప్రస్తుతం ఉన్న పాత సచివాలయాన్ని తొలగించాల్సిందే. ఆ పనేదో ఇప్పుడే చేయడం స్వాగతించాల్సిందే. దీనిపై విమర్శల కన్నా సూచనలు చేస్తే మరీమంచిది. పాత సచివాలయాన్ని కూల్చడంతో కాలగర్భంలో పాలనా భవనాలు అంటూ వ్యాఖ్యానాలు చేయడం సరికాదు. మహామహులు,, మహానగరాలే కాలగర్భంలో కలసి పోతుంటే, ఓ పురాతన కట్టడం తొలగించడం కాలగర్భంలో కలసిపోవడం ఎలా అవుతుందో అర్ధం కాని ప్రశ్న మొత్తంగా సిఎం కెసిఆర్‌ సంకల్పబలంతో అదునాతన సచివాలయం మరో అందుకు తెలంగాణకు గుందెకాయలాంటి అధునాతన సచివాలయం ఆవిష్కతం కానుంది.