అప్పుల తెలంగాణ! : సీఎల్పీ నేత భట్టి విక్రమార్మ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 18, 2020

అప్పుల తెలంగాణ! : సీఎల్పీ నేత భట్టి విక్రమార్మ


హైదరాబాద్‌,జూలై 17(శుభ తెలంగాణ): తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని.. విపరీతమైన అప్పులతో రాష్ట్రాన్ని తకాట్టు పెట్టే దిశగా సిఎం కెసిఆర్‌ తీసుకుని వెళుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్మ మరోసారి ప్రభుత్వం పైర్‌ అయ్యారు. రాష్ట్రంపై మోయలేని అప్పుల భారాన్ని వేశారని అన్నారు. అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు తెస్తున్నారని, రాష్ట్ర విభజన సమయా నికి 68,950 కోట్ల అప్పు ఉంటే తెలంగాణ ఏర్పడిన తరువాత అప్పు 2 లక్షల కోట్లు దాటింద న్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ౩ లక్షలపై చిలుకు అప్పు పెరిగిందని మండిపడ్డారు. ఇది చాలదన్నట్టు ఏటా 50వేల కోట్లు అప్పు తెచ్చేందుకు ఎఫ్‌ఆర్‌బి ఎం ను పెంచుకున్నారని అన్నారు. కార్పొరేషన్ల పేరుతో కూడా కేసీఆర్‌ అప్పులు తెచ్చారని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి 6లక్షల కోట్ల అప్పులు తెబోతున్నారని విమర్శించారు. 6లక్షల కోట్ల అప్పులు తెలంగాణ మోయగలుగుతుందా..? అని ప్రశ్నించారు. నీ రాష్ట్ర ఆదాయం ఎంత... అప్పులు ఎంతా..? అంటూ ఫైర్‌ అయ్యారు. ఇది సంక్షేమ ప్రభుత్వం కాదని ..సంక్షోభ సర్కార్‌ అని అన్నారు. 4 కోట్ల జనాభా లో ఒక్కొక్కరిపై లక్ష 50 వేలు అప్పు పడిందని తెలిపారు. మనల్ని తాకట్టు పెట్టి లక్షల కోట్ల అప్పు తెచ్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కరోనాతో ప్రజలందరూ బయపడుతుంటే సీఎం అప్పులపై సిఎం కెసిఆర్‌ దృష్టి పెట్టారని భట్టి విక్ర మార్క ఆరోపించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మోడియా పాయింట్‌ ముందు మాట్లాడుతూ రాష్ట్రా న్ని సీఎం కేసీఆర్‌ అప్పుల సుడిగుండంలో ముంచార న్నారు. ఎఫ్‌ ఆర్‌ బిఎమ్‌ ను 5శాంతంకు పెంచుతూ ఆర్డినెన్స్‌ పై గవర్నర్‌ సంతకం తెచ్చారని... బ్యాంక్‌ గ్యారెంటీ కోసం 90శాతం నుంచి 200 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్‌ తెచ్చారని తెలిపారు. 2019-20 అప్పులు 2లక్షల కోట్లకు చేరిందని, రాష్ట్రం ఏర్పాటు సమయంలో 68 వేల అప్పు మాత్రమే ఉండేదన్నారు. 2014 నుంచి 2019-20 వరకు 2లక్షలు పెంచారని, 2020-2021 వచ్చే సరికి ౩లక్షల 20వేలకు పెంచారన్నారు!. ఎఫ్‌ ఆర్‌ బిఎమ్‌ పెంచడం వల్ల 50వేలు మళ్ళీ అప్పు తేవడానికి ఆర్డినెన్స్‌ తెచ్చారన్న ఆయన..2023 కల్లా 6 లక్షల కోట్ల అప్పు చేసేందుకు తెలంగాణ సర్కారు స్వీకారం చుట్టిందన్నారు. రూ. ౩లక్షల కోట్లకు ఏడాదికి 40వేల కోట్లు అప్పు కట్టడానికి సరిపోతుందన్నారు. బంగారు తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణగా మార్చారన్నారు. జాతీయ ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం మెరుగ్గా ఉందన్నారు. తెస్తున్న అప్పుల వల్ల తెలంగాణలో అభివృద్ధి కనిపించడంలేదని.. మరి నిధులన్నీ ఎక్కడ పోతున్నాయని ప్రశ్నించారు. తెస్తున్న అప్పులపై కేసీఆర్‌ శ్వేతపత్రం విడుదల చెయ్యాలని... తెలంగాణ అప్పుల కూపీలో మునుగుతుందని.. యువత అంతా మేల్మోవాలన్నారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చెయ్యకపోతే .. కేంద్రానికి, ఆర్థిక సంస్థలకు మేమే ప్రజల తరపున అప్పులు ఇవ్వొద్దని చెప్తామన్నారు. తిరిగి కట్టలేని అప్పులు చేస్తే... అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ అమెరికా పోతారని... మరి తెలంగాణ ప్రజలు ఎటు పోవాలన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి 5000 కోట్లు కావలన్నారు.. కేటాయింపులు మాత్రం జీరో అని మండిపడ్డారు. రోశయ్య సీఎం గా ఉన్నప్పుడే ఉస్మానియా పక్కన భవన నిర్మాణం కోసం 200 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. దాన్ని కొనసాగించాలని మేము చెప్పాం. కొత్త భవనం కడతామని మొదటి టర్మ్‌లో మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారన్నారు. తలసాని... నీ శాఖలో ఏమైతుందో తెలియదు నీకు ఆరోగ్య శాఖ సంగతి ఎందుకు అని ప్రశ్నించారు. గాడిద పెత్తనం కుక్క ఎత్తుకుంటే నడుములు ఇరిగాయన్నట్టు ఉంది నీ పద్ధతి అంటూ ఎద్దేవా చేసారు. ఉస్మానియా లోకి నీళ్లు ఎలా వచ్చాయో చూడాల్సిన మున్సిపల్‌ శాఖ మంత్రి ఎక్కడ..? ఎప్పుడూ రాని డ్రైనేజీ నీళ్లు.. ఇప్పుడే ఎందుకు వచ్చాయి? అని ప్రశ్నించారు. తలసానికి తలా... తోక తెలియదని నోరుందని అడ్డగోలుగా మాట్లాడవద్దని అన్నారు.