ఉప్పొంగిన కాగ్నా నది… కొట్టుకుపోయిన వంతెన - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 03, 2020

ఉప్పొంగిన కాగ్నా నది… కొట్టుకుపోయిన వంతెన

వికారాబాద్‌ జిల్లా తాండూరులో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కాగ్నానది వంతెన రహదారి కొట్టుకుపోయింది. భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో కాగ్నా నది తీవ్ర రూపం దాల్చింది. వరద తాకిడికి కొండగల్‌-తాండూర్‌ మార్గం మధ్యలో తాత్కాలికంగా నిర్మించిన వంతెన తెగిపోయింది. దీంతో తాండూరు, మహబూబ్‌నగర్‌కు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటలకుపైగా కురిసిన వర్షానికి కాగ్నానదికి భారీగా వరదనీరు చేరింది. ఈ నేపథ్యంలో రహదారి కింద నుంచి నీరు ఉధృతంగా ప్రవహించింది. అయితే మధ్యభాగంలో మట్టి కొట్టుకుపోవడంతో రహదారి ఆ ధాటికి నిలవలేకపోయింది.