కరోనా కట్టడికి జిల్లా స్థాయిలో టాస్మోర్స్‌లు ఏర్పాటు చేయాలి - తనుగుల జితేందర్‌ రావు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 17, 2020

కరోనా కట్టడికి జిల్లా స్థాయిలో టాస్మోర్స్‌లు ఏర్పాటు చేయాలి - తనుగుల జితేందర్‌ రావు


- బిజెపి నేత పొంగులేటి డిమాండ్‌
- కరోనా కట్టడికి జిల్లా స్థాయిలో టాస్మోర్స్‌లు
ఏర్పాటు చేయాలి - తనుగుల జితేందర్‌ రావు

హైదరాబాద్‌ (శుభ తెలంగాణ) : కరోనా ఉధృతి నేపథ్యంలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణమే సందర్శించి పరిస్థితులను చక్కదిద్దాలని బిజెప్‌ కోర్‌ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనిటి ఆఫ్‌ ప్రెస్‌ అండ్‌ మీడియా ప్రధాన కార్యదర్శి తనుగుల జితేందర్‌ రావు తో కలిసి మాట్లాడుతూ... ఒకవైపు కరోనా... మరోవైపు వర్షాలతో ఉస్మానియా ఆసుపత్రిలో రోగులు ,డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు... కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వవలసిన భాద్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. కరోనా కట్టడికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ సమీక్ష చేస్తున్నారని కేసీఆర్‌ కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు... ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులును దోచుకుంటున్నాని ఆరోపించారు... ప్రైవేటు ఆసుపత్రిలలో ఫీజులను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు... హైకోర్టు మొట్టికాయలు వేసిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ధ్వజమెత్తారు... కరోనా కట్టడికి జిల్లా స్థాయిలో టాస్కోర్స్‌ లను ఏర్పాటు చేయాలని కోరారు. ..వర్నాలు కురుస్తుండడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు... జిల్లాలలో ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మందులు ,పరికరాలు అందుబాటులో ఉంచడం తోపాటు భద్రాచలం ఏజెన్సీ లో ర్యాపోడ్‌ టెస్టు లకు వైద్యుల ను సిద్ధం చేయాలని సూచించారు.