ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయండి : ప్రభుత్వ విప్ కే కాంతారావు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 18, 2020

ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయండి : ప్రభుత్వ విప్ కే కాంతారావు


మణుగూరు (శుభతెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణు గూరు మండలంలో పోడుభూము ల రైతులను ఇబ్బదులకు గురి చెయ్యవద్దుని ఫారెస్టు అధికారుల పై ప్రభుత్వ విప్‌ రేగాకాంతారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మణు గూరు ఎంపిడివో కార్యాలయం లో శుక్రవారం ఎంపిపి కారం విజయ కుమారి అధ్యక్షతన సర్వ సభ్యసమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు మాట్లాడుతూ ఫారెస్టు అధికారుల ను మీ దగ్గర వున్నా వివరాలు తెలియ పరచాలి అని ఆడుగగ్గా సమాచారంతో రాలేదని తెలుపగా వారిపై అసహనం వ్యక్తం చేసారు. ఈ సర్వసభ్య సమావేశానికి పూర్తీ సమాచారంతో ఫారెస్ట్‌ అధికారులు రానందున వారిని సస్పెండ్‌ చేయాలని సభలో ప్రజా ప్రతినిధు లను కోరారు. సభకు హాజరైన ప్రజా ప్రతినిధులు చేతులు వెత్తి సస్పెండ్‌కు తీర్మానించింది. అనం తరం పగిడేరు ఎంపిటిసి కుంజా కృష్ణకుమారి,కూనవరం2 ఎంపిటిసి గూడిపూడి కోటేశ్వర రావు మాట్లాడుతూ మిషన్‌ భగీరధ ద్వారా త్రాగునీరు అందడం లేదన్నారు. గ్రామాల్లో వాటర్‌ ట్యాంకులను నిర్మించారు ప్రజలకు నీరు సరఫరా చేయడం లేదన్నా రు. వర్ష కాలంలో కూడా మంచి ఎద్దడికి గ్రామ ప్రజలు ఎదుర్కొం టున్నరన్నారు. వైస్‌ ఎంపిపి కేవి రావు మాట్లాడుతూ ఉపాధి హామీ పధకం ద్వారా నాటిన మొక్కల రక్షణకు భాద్యతలు ఎవరు వహిస్తారని వాటిని గాలికి వది లేసారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్చిటిసి పోశం నరసింహారావు, ఎంపిడివో షిలార్‌ సాహెబ్‌, తహశీ ల్ఫార్‌ లూధర్‌ విల్సన్‌, ఎంపివో వెంకటేశ్వరరావు, ఎంపిటిసిలు మచ్చా సమ్మక్క కామశెట్టి రామా 'రావు,లక్ష్యయ్య, కణితి బాబురావు, సమితి సింగారం సర్పంచ్‌ బచ్చల భారతి, సాంబాయిగూడెం సర్పంచ్‌ కాయం తిరుపతమ్మ, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.