కరోనాతో సంగారెడ్డి కౌన్సిలర్‌ మృతి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 06, 2020

కరోనాతో సంగారెడ్డి కౌన్సిలర్‌ మృతి

సంగారెడ్డి మున్సిపాలిటీకి చెందిన ఓ మహిళా కౌన్సిలర్‌ కరోనాతో మృతిచెందారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆమెకు ఐదు రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమె హైదరాబాద్‌లోని ఛాతీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమె ఈ రోజు మరణించినట్లు జిల్లా వైద్యాధికారి ప్రకటించారు. ఆమె కొడుకుకు కూడా కరోనా సోకిందని, ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.