టాలీవుడ్ లో లక్కీ గర్ల్ గా మారిపోయిన రష్మిక - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 26, 2020

టాలీవుడ్ లో లక్కీ గర్ల్ గా మారిపోయిన రష్మిక


హీరోయిన్ రష్మిక టాలీవుడ్ లో లక్కీ గర్ల్ గా మారిపోయిన విషయం తెలిసిందే . . టాలీవుడ్ లో ప్రస్తుతం ఆమెకు మామూలు క్రేజ్ లేదు. చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు అంతా ఈమెనే కావాలంటున్నారు. శౌర్య ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి విజయ్ దేవరకొండ తో గీత గోవిందం , డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించింది. అలానే నితిన్ హీరోగా భీష్మ , సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో బ్లాక్ బాస్టర్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమాలతో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది . తెలుగుతో పాటు తమిళం.. కన్నడంలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు హిందీలో స్టార్ డం కోసం వెయిట్ చేస్తోంది. అల్లుఅర్జున్ పుష్ప చిత్రంతో హిందీ ప్రేక్షకులకు రష్మిక పరిచయం కాబోతుంది. అయితే అంతకు ముందే ఒక కన్నడ మూవీతో హిందీ ప్రేక్షకులకు రష్మిక పరిచయం అయ్యేందుకు సిద్దం అయ్యింది. కన్నడ స్టార్ ధృవ సర్జా హీరోగా నటించిన 'పొగరు' చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.కేజీఎఫ్ సినిమాతో ఉత్తరాదిన కన్నడ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది . దాంతో పొగరు సినిమానుకూడా అక్కడ రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్ . పొగరు, పుష్ప సినిమాలు హిందీలో కూడా హిట్ కొడితే రష్మికకు బాలీవుడ్ ఆఫర్లు క్యూ కట్టే అవకాశం లేకపోలేదు అంటున్నారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )