గజ్వేల్ (సిద్దిపేట), జూలై 30(శుభ తెలంగాణ): రెవెన్యూ అధికారుల వేధింపులు మరో రైతును బలితీసుకుంది. బలవంతపు భూ బదలాయింపు వ్యవహారంతో మనస్తాపం చెందిన ఓ దళిత రైతు...దాన్ని భరించలేక తనువు చాలించాడు. గజ్వెల్ నియోజకవర్గం వర్గల్ మండలం వేలూరుకు చెందిన ఓ దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన బ్యాగరి నర్సింహులు అనే రైతుకు చెందిన 18 గుంటల భూమిని... రైతు వేదిక భవనానికి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి తెస్తు న్నారు. ఆ కారణంతో భూమిని రికార్డుల్లో కూడా ఎక్కించలేదు. దాంతో మనస్థాపం చెందిన నర్సిం హులు బుధవారం పొలం దగ్గరి కెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల వాళ్లు వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన తర్వాత మెరుగైన వైద్యం కోసం సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నర్సింహులు గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. భూమిని రైతు వేదిక భవనానికి ఇవ్వాలని రెవె న్యూ అధికారుల ఒత్తిడివల్లే నర్సిం హులు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నర్సిం హులు ఆత్మహత్యపై గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అతనికి న్యాయం చేయాలన్నారు. దీనిపై కటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. తనతండ్రి మృతికి కారణమైన వారిపై చర్య తీసుకో వాలని డిమాండ్ చేశారు. ఆ భూమిని రైతు వేదిక భవనానికి ఇవ్వాలని బలవంతం చేయడం తో ఆవేదనతో పురుగుల మందు తాగడని కుటుంభ సభ్యుల ఆరోపి స్తున్నారు.పురుగుల మందు తాగు తూ బాధితుడు సెల్ఫీ ఫోటో, వాయిస్ రికార్డు చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ ఇంటి ముం దు మృతుని కుటుంబీకులు బైఠా యించి ఆందోళనకు దిగారు. దీంతో గ్రామానికి బారీగా. పోలీసులు మోహరించారు. - దళిత రైతు మృతికి బాధ్యత వహించాలి: కాంగ్రెస్ బ్యాగరి నర్సింహులు మృతిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్పీ కులానికి చెందిన నర్సింహులు మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయా లని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్పటి నుండి దళితులపై దాడులు చేయిస్తూ వారి మరణానికి కారణమవు తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. నర్సింలు మరణానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నర్సింలు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. దళితులకు మూడు ఎకరాల ఇస్తామని మోసం చేసి ఇప్పుడు ఉన్న భూమి దౌర్జన్యంగా గుంజుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే ఇంత దారుణమా అని ఉత్తమ్ ప్రశ్నించా రు. దళితులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయన్నారు. దళిత ముఖ్యమంత్రి చేస్తామని మోసం చేసి దళితులను బలి తీసుకుంటున్నారని విమర్శించారు. దళిత, బడుగు, బలహీన వర్గాలు ఏకం కావాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలన అంతం అయ్యే వరకు దళితులకు న్యాయం జరగదన్నారు. నర్సింలు మరణానికి కారణమైన అందరిపైన హత్య కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. - రైతు ఆత్మహత్యపై బిజెపి కమిటీ, సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో ఎస్సీ వర్గానికి చెందిన బ్యాగరి నరసింహులు పురుగుల మందు తాగి మరణించడం పట్ల బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరిగిన ఈ ఆత్మహత్య ప్రభుత్వ హత్యగా భావిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. అన్నారు. వాస్తవాలు తెలుసుకునేందుకు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి,మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, బాబుమోహన్, ఎన్. రామ చందర్ రావు, ఎమ్మెల్యే రాజా సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ప్రేమేందర్ రెడ్డి, బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వేముల అశోక్‌లతో నిజ నిర్దారణ కమిటీని వేశారు .బండి ఈ కమిటీబ్యాగరి నరసింహులు కుటుంబ నభ్యులను పరామర్శిన్తుందన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని బండి సంజయ్ అన్నారు. పరోక్షంగా ముఖ్యమంత్రి 'ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు. దళితుల భూములను లాక్కోవడం అక్రమాలకు పాల్పడటం టిఆర్ఎస్ పార్టీ నేతలకు అలవాటేనన్నారు. ఇలాంటి ఘటనలపై వాస్తవాలు బయటకు రావాలన్నారు.