రైతు భీమ చెక్కులను అందచేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 18, 2020

రైతు భీమ చెక్కులను అందచేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి


గద్వాల (శుభ తెలంగాణ) : గద్వాల నియోజకవర్గంలోని కేటి దొడ్డి మండలం, కొండాపురం గ్రామానికి చెందిన వడ్డే కృష్ణ అనారోగ్యంతో మరణించారు. మృతుని భార్య రేవతికి ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా రైతు బీమా రూ. 5లక్షల చెక్కును శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో అందజేశారు. ఆపద స్థితిలో ఉన్న మమ్మల్ని ఆదుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇందుకు కృషి చం ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జద్చిటీసీ రాజశేఖర్‌, వైస్‌ ఎంపీపీ రామకృష్ణనాయుడు, తెరాస పార్టీ నాయకులు చక్రధరరావు, నక్క శేఖర్‌ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఉరుకుందు, రాజేష్స్‌ చిన్ననక్క శేఖర్‌ రెడ్డి, తిమ్మారెడ్ది, నారాయణరెడ్డి, వార్డ్‌ మెంబర్లు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad