ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 24, 2020

ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన


హైదరాబాద్, జూలై 23(శుభ తెలంగాణ)  : హైదరాబాద్ నగరంలోని మరో భారీ ప్రాజెక్టుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఎస్ఆర్డీపీ కింద రూ.523 కోట్లతో నల్గొండ క్రాస్ రోడ్ నుండి ఓవైసీ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మహమ్మద్ అలీ,మేయర్ బొంతు రామ్మోహన్ ,ఎంపీ అసద్ పాల్గొన్నారు నల్గొండ క్రాస్ రోడ్ నుండి వయా సైదాబాద్, ఐ.ఎస్.సదన్ ద్వారా ఓవైసీ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఈ కారిడార్ పొడవు 3.382 కిలోమీటర్లు కాగా... అందులో ఫ్లెఓవర్ పొడవు 2.580 కిలోమీటర్లుగా ఉ ండనుంది. మిగిలినది రెండు వైపులా ర్యాంప్లు నిర్మించనున్నారు మొదటి పేజీ కొనసాగింపు అలాగే రెండు వైపులా రాకపోకలు సాగించే విధంగా నాలుగు లేన్లతో ఈ కారిడార్ నిర్మాణం జరుగనుంది. 24 నెలల్లో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసేలా జీహెచ్ఎంసీ సంకల్పించింది. ఈ కారిడార్ నిర్మాణంతో నల్గొండ క్రాస్ రోడ్ నుండి ఓవైసి హాస్పిటల్ జంక్షన్ వరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారంకానుంది. అలాగే చంపాపేట, చంద్రాయణగుట్ట వైపు వెళ్ే వాహనదారుల సమయం కూడా ఆదా అవనుంది. దీంతో ఐ.ఎస్.సదన్ జంక్షన్ పై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. చంచల్గూడ జంక్షన్, సైదాబాద్ జంక్షన్ దోబిఘాట్ జంక్షన్, ఐ.ఎస్.సదన్ జంక్షన్లలో నెలకొన్న ట్రాఫిక్ సమస్య తొలగిపోనుంది. అలాగే ఈ రూటులో శంషాబాద్ ఎయిర్ పోర్టు వెళ్లడానికి మార్గం సుగమం కానుంది. మహానగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. నగరం విస్తీర్ణంతో పాటు ట్రాఫిక్ సమస్య క్రమంగా పెరిగిపోతున్నది దీంతో నగరంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఫ్లైఓవర్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పెరుగుతున్న ట్రాఫిక్ కి రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు నిత్యం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని నల్గొండ క్రాస్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మొత్తం రూ.523.37 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెట్టబోతున్నది నెలల్లో ఈ కారిడార్ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఇప్పటికే ఈ మార్గంలో సగటున రోజుకు నుంచి 30వేల వాహనాలు తిరుగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో 70వేలకు పైగా వాహనాలు తిరుగుతాయి. 2035 నాటికి ఈ సంఖ్య రెండు లక్షలు దాటే అవకాశం ఉన్నది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కారిడార్ ను నిర్మిస్తున్నట్టు మంత్రి కెటిఆర్ తెలిపారు