కోడె ప్రతిమ ఆవిష్కరించిన తలసాని - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 17, 2020

కోడె ప్రతిమ ఆవిష్కరించిన తలసానిహైదరాబాద్‌, జూలై 16(శుభ తెలంగాణ): బాగా ప్రసిద్ది చెందిన పశుజాతికి చెందిన తూర్పు పోదా కోడె ప్రతిమను గురువారం పశుసంవర్ధక శాఖ ఆవరణలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈపశు జాతి, నల్లమల్ల అడవి ప్రాంతంలోనిమన్ననూర్‌,అమ్రాబాద్‌ మండలం, నాగర్‌ కర్నూల్‌ జిల్లలో ఎక్కవగా ఉంటాయన్నాడి. . దీనిని ఎన్‌బిఎజిఆర్‌ ఇండియా, తెలంగాణ స్థానిక జాతిగా గుర్తించింది. ఈ పశువులకుప్రధానంగా తెలుపు చర్మంపై గోధుమ, ఎరుపు మచ్చలు లేదా లేత గోధుమ రంగు చర్మంపై తెల్లని మచ్చలు,సూటి ,పదునైన కొమ్ములను కలిగి ఉంటాయి. అన్ని కాలాలలోఈ పశువులు వ్యవసాయ పనులుచాలా సమర్ధవంతగా చేస్తాయి. వీటి ఉత్సాదక శక్తి చాలా ఎక్కువ. ఆవులు క్రమం తప్పకుండా దాని జీవిత కాలంలో 10 కంటే ఎక్కువ దూడలను ఇస్తాయి. ఈ పశువులుమేత తక్కువగా తిని,రోజుకు 20 లీటర్ల కన్నా తక్కువ నీరు తాగుతుంది. ఈ పశువులు సుదూర అటవీ ప్రాంతంలోని నీటిని గుర్తించి తాగి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం పశువైద్య సేవలలో రైతులకు ఇబ్బంది రాకుండా పశువైద్య ,పశుసంవర్థక శాఖలో 530 వివిధ స్థాయిలలో పనిచేస్తుచున్నఆవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను మరో ఏడాది 31,మార్చి, 2021 వరకు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లుమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలియజేసినారు. అదేవిధంగాఈ ఆషాడమాస బోనాల సందర్భంగా రాష్ట్రంలో కృతిమ గర్భధారణలో విశేష సేవలు అందిస్తున్న (1300) మందిగోపాలమిత్రులకు ఒక్క నెల వెతనభత్యం విడుదల చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమములోసంచాలకులు దా. వి. లక్ష్మారెడ్డి, అదనపు సంచాలకులు డా. ఎస్‌. రాంచందర్‌ ,ఓ.ఎస్‌.డి. శ్రీ కళ్యాణ్‌ కుమార్‌, డైరేక్టరేట్‌ సిబ్బంది,పాల్గొన్నారు.