గాంధీ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ నర్సుల జీతాల పెంపు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 13, 2020

గాంధీ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ నర్సుల జీతాల పెంపు


శుభ తెలంగాణ, హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న నర్సులకు  ప్రతి నెలా రూ. 17,500 చొప్పున జీతం ఇస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.25వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఇటీవల కోవిడ్‌–19 చికిత్స కోసం ని యమితులైన నర్సులకు రూ.25 వేలు చెల్లిస్తున్నా రు. తాము ఎప్పట్నుంచో పనిచేస్తున్నా తక్కువ జీతమివ్వడం ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల వైద్య విద్యా సంచాలకుడి కార్యాలయం వద్ద ఔట్‌సోర్సింగ్‌ నర్సులు వరుసగా 3 రోజులు ధర్నా చేశారు. దీంతో డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి వారి జీతాల పెంపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.