జూరాలలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 18, 2020

జూరాలలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి


గద్వాల(శుభ తెలంగాణ) :జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరదనీటి ఉద్ధృతి రాత్రి 7-30 గంటలకు స్వల్పంగా తగ్గడంతో దిగువకు నీటి విడుదల తగ్గించారు. గేట్ల ద్వారా నీటి విడుదల తగ్గించి విద్యుదుత్పత్తికి మాత్రం 5 యూనిట్లకు నీటిని వదులుతున్నారు. జూరాల జలాశయంలోకి 92 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దిగువకు 9గేట్ల ద్వారా 37,620, జల విద్యుదుత్పత్తి ద్వారా 37,434 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎత్తిపోతల పథకాలకు నీటిని తరలిస్తున్నారు. నెట్టెంపాడు, భీమా, కోయల్‌సాగర్‌తోపాటు భీమా-2 సమాంతర కాల్వ, జూరాల కుడి, ఎదమ కాల్వలకు కలిపి 4,600 క్యూసెక్కులు నీటిని తరలిస్తున్నారు. ఎగువ, దిగువ జల విద్యుత్తు కేంద్రాల్లో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఒక్కో యూనిట్‌ నుంచి గరిష్టంగా ౩9 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. ఎగువ జూరాలలో శుక్రవారం 3.493 మిలియన్‌ యూనిట్లు, దిగువ జూరాలలో 3.919 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి రాగా నాలుగు రోజుల వ్యవధిలో మొత్తం 15.450 మిలియన్‌ యూనిట్ల ఉ త్పత్తి వచ్చిందని జెన్‌కో అధికారులు తెలిపారు. కర్ణాటక ప్రాజెక్టులకు వరద నిలకడగా కొనసాగుతోంది. జలాశయాల్లో గరిష్ట నీటి నిల్వలున్న కారణంగా వచ్చిన వరద నీటిని మొత్తం దిగువకు వదులుతున్నట్లు జూరాల అధికారులు తెలిపారు.