ఆ ఆలోచనే భయమేస్తోంది... అలా జరిగితే ఒక్క ఊరు మిగలదు.. : రేవంత్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 01, 2020

ఆ ఆలోచనే భయమేస్తోంది... అలా జరిగితే ఒక్క ఊరు మిగలదు.. : రేవంత్

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని... కేంద్రంలో ఉన్న బీజేపీకి చిత్తశుద్ది ఉంటే దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాలేదని, ఇప్పటికే రెండు ప్రధాన కాలువలకు గండ్లు పడ్డాయని అన్నారు. కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడిన నేపథ్యంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు.
కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లే కాలువకు గండి పడిందని.. చిన్న కాలువల పరిస్థితే ఇలా ఉంటే 50 టీఎంసీల మల్లన్నసాగర్, 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్‌, గందమల్ల ప్రాజెక్టుల పరిస్థితి గురించి ఆలోచిస్తేనే భయమేస్తోందని రేవంత్ అన్నారు. వాటికి కూడా ఇలాగే గండిపడితే.. వాటి పరిధిలో ఒక్క ఊరు కూడా మిగలదని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే, కేసీఆర్ ఫాంహౌస్‌కు పోయే కాలువ పనుల్లోనే ఈ స్థాయిలో నాణ్యతా లోపాలు బయపడితే... ఇక రాష్ట్రంలో జరిగిన మిగతా కాలువలు, జలాశయాల నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్, మెఘా ఇంజినీరింగ్ కంపెనీ కమీషన్ల కక్కుర్తికి ఈ నాణ్యత లోపాలే నిదర్శనమన్నారు రేవంత్. రూ.లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆ అవినీతి సొమ్ముతోనే కేసీఆర్ రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.