శుభ తెలంగాణ (జూలై ,15, 2020 ), సికింద్రాబాద్ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగిన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి పొరుగు సేవల సిబ్బంది ఆందోళనలను కొనసాగిస్తున్నారు. వర్షంపడుతున్నా లెక్క చేయకుండ వారు తమ ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను సానుభూతితో పరిశీలించాలని వారు సిఎం కెసిఆర్‌ను కోరారు. వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్దీకరణ సహా వివిధ సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ గాంధీ ఆసుపత్రి పొరుగుసేవల సిబ్బంది గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి కరోనా బాధితులను కాపాడుతున్నా సరైన వేతనాలు ఇవ్వట్లేదని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బెట్సోర్సింగ్ నర్సులు, పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బంది విధులు బహిష్కరించి రోడ్డుపై బైలాయించడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయి రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఓపీ, ఇతర వార్డుల్లో రోగులకు సేవల్లో అంతరాయమేర్పడింది. సెక్యూరిటీ, శానిటైజేషన్, ఫోర్త్ క్లాస్ పేషేంట్ కేర్ సిబ్బంది విధులు బహిష్కరించారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే వారం రోజులుగా నిరవధిక సమ్మెలో 600 మంది నర్సులు పాల్గొన్నారు. దీంతో కరోనా పేషెంట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విధులకు హాజరు కావాలని, సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం కోరినా ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు విధుల్లో చేరమని చెబుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, జెట్సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మంగళవారం విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే.