ఖమ్మం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్ చార్జిగా ఆర్జేసీ కృష్ణ నియామకం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 02, 2020

ఖమ్మం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్ చార్జిగా ఆర్జేసీ కృష్ణ నియామకం

ఖమ్మం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జిల్లా కార్యాలయ ఇంచార్జిగా ఆర్జేసీ కృష్ణను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు నియమించారు. హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ తో భేటీ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  నేతృత్వంలో కృష్ణను జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జిగా నియమించినట్లు మంత్రి పువ్వాడ  స్పష్టం చేశారు. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. తనను ఇంచార్జిగా నియమించిన మంత్రులు, కేటీఆర్, అజయ్ కుమార్ కు కృష్ణ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.