హరితహారం లక్ష్యాన్ని సాధించాలి : జిల్లా రెవిన్యూ అధికారిణి కె. రమాదేవి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 14, 2020

హరితహారం లక్ష్యాన్ని సాధించాలి : జిల్లా రెవిన్యూ అధికారిణి కె. రమాదేవి


ములుగు శుభ తెలంగాణ : తెలంగాణాకు హరితహారం క్రింద వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారిణి కె. రమాదేవి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా అధికారులతో హరితహారం, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం, మండల ప్రత్యేక అధికారులతో గ్రామాల్లో పల్లె ప్రగతి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారిణి మాట్లాడుతూ, హరిత హారం క్రింద అటవీ శాఖకు 7.25 లక్షలు, డిఆర్జీఏ కు 7.22 లక్షలు, పీవో ఐటీడీఏ, రెవిన్యూ, వ్యవసాయ, ఉ ద్యానవన, పోలీసు, బిసి సంక్షేమ శాఖలకు లక్ష చొప్పున, విద్యా శాఖకు 50 వేల మొక్కలు నాటుటకు లక్ష్యంగా ఇచ్చినట్లు, వర్షాలు పడుతున్నందున లక్ష్యం పూర్తికి చర్యలు చేపట్టాలని అన్నారు. మార్చి 2 నుండి ఇప్పటి వరకు ప్రజావాణి ద్వారా వివిధ శాఖలకు సంబంధించి 458 దరఖాస్తులు రాగా, 285 దరఖాస్తులు పరిష్కరించినట్లు, 20 దరఖాస్తులు పరిష్కారానికి ఫార్వార్డ్‌ చేసినట్లు, 153 దరఖాస్తులు పెండింగులో వున్నట్లు తెలిపారు. పెండింగ్‌ దరఖాస్తులపై చర్యలు చేపట్టి, త్వరితగతిన పరిష్మరించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన మండలంలో ప్రతి బుధవారం పర్యటించాలని, అన్ని శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్షలు చేయాలని అన్నారు. మండల సమీక్షలో పల్లె ప్రగతి అభివృద్ధి పనులతో పాటు, హరితహారం లక్ష్య సాధనను సమీక్షించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డిఆర్జీవో ఏ. పారిజాతం, ఇడి ఎస్సి కార్పొరేషన్‌ టి. రవి, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఏ. అప్పయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా వ్యవసాయ అధికారి గౌస్‌ హైదర్‌, ఇఇ రోడ్లు భవనాలు వెంకటేష్‌, డిడి భూగర్భ జల శాఖ రాజి రెడ్డి జిల్లా బిసి సంక్షేమ అధికారి లక్ష్మణ్‌, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారిణి పి. భాగ్యలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారిణి మల్లీశ్వరి, డిపిఎం పద్మ ప్రియ, జిల్లా మత్స్య శాఖాధికారి వీరన్న అధికారులు తదితరులు పాల్గొన్నారు.