హైదరాబాద్ శివారులో మహింద్రా యూనివర్సిటీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 25, 2020

హైదరాబాద్ శివారులో మహింద్రా యూనివర్సిటీ


హైదరాబాద్, జూలై 24(శుభ తెలంగాణ):రాష్ట్రంలో మహింద్రా వర్సిటీ అందుబాటులోకి వచ్చింది.ప్రైవేట్ వర్సిటీలను ప్రోత్సహిస్తున్న ప్రభు త్వం ఈయూనివర్సిటీకి అనుమతించింది. రాజధాని హైదరాబాద్ కు సమీపంలోని బహదూర్ పల్లిలో మహీంద్రా విశ్వవిద్యాలయం శు క్రవారం ప్రారంభమైంది. ఆనంద్ మహీంద్రాతో కలిసి ఐటీ మంత్రి కేటీఆర్ వర్చువల్గా యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వర్సిటీ రూపకల్పనలో ఆనంద్ మహీంద్రా క్రియాశీలక పాత్ర వహించారని కొనియాడారు. ఈ యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పుతుందన్నారు. మహీంద్రా వర్సిటీ ఇన్నోవేషన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు వర్సిటీ ప్రారంభం సంద »గా మహీంద్రా గ్రూపునకు కేటీఆర్ అభినం దనలు తెలిపారు. ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. నూతనంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. భావితరా లకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు ప్రతి 8 మంది భారతీయుల్లో ఒకరు మాత్రమే కాలేజీకి వెళ్తున్నారు ఇప్పుడు నలుగురిలో ఒకరు కాలేజీకి వెళ్లేలా చేయాలన్నారు