రేపటి నుండి కరోనా రాపిడ్‌ డయాగ్నస్టిక్‌ టెస్టులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 09, 2020

రేపటి నుండి కరోనా రాపిడ్‌ డయాగ్నస్టిక్‌ టెస్టులు


కుత్చుల్లాపూర్‌, జూలై 08(శుభ తెలంగాణ): కుత్చుల్లాపూర్‌ నియోజకవర్గంలోని జీహెచ్‌ఎంసి పరిధిలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్న సేవలు, సమస్యలపై ఇటీవలే ఎమ్మెల్యే కేపి వివేకానంద్‌ తన క్యాంపు కార్యాలయం నుండి విడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైద్య అధికారులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. ఆయా సమస్యలను ఎమ్మెల్యే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఎమ్మెల్యే కృషితో రేపటి నుండి (గాజులరామారం, షాపూర్‌ నగర్‌, సూరారం, కుత్చుల్లాపూర్‌) (గ్రామాలలోని 4 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్‌-19 రాపిడ్‌ డయాగ్నస్టిక్‌ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ కేంద్రాల్లో ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి రోజు 25 మందికి కోవిడ్‌ -19 రాపిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. వాటి ఫలితాలు కూడా కొద్ది గంటల వ్యవధిలోనే తెలుపనున్నారు. ఈ ఆసుపత్రుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఎమ్మెల్యే వ్యక్తి గతంగా 300 పిపిఈ కిట్లు మరియు 500 ఎన్‌-95 మాస్కులను అందజేస్తున్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు, భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని, కోవిడ్‌ -19 బారిన పడిన వారిలో సాధారణ చికిత్సతోనే సుమారు 80 శాతం మంది కోలుకుంటున్నారని ప్రజలు అఫప్రమతంగా ఉంటూ, సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సూచనలు పాటించాలని ఎమ్మెల్యే అన్నారు. జలుబు, తీవ్రమైన దగ్గు, విపరీతమైన జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారు పైన తెలిపిన కేంద్రాలలో పరీక్షలు చేయించు కోవాలని ఎమ్మెల్యే కోరారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉ ందని, కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఇప్పటికే గ్రేటర్‌ హైద్రాబాద్‌ తో పాటు మిగతా జిల్లాల్లో కోవిడ్‌ వైద్యం అందుబాటులో ఉందని అన్నారు.