మణుగూరు, (శుభ తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని 14గ్రామపంచాయితీలలో న్థానిక సమస్యలను తెలుసు కొనేందుకు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహనా కల్పించేందుకు ఎంపిపి కారం విజయ కుమారి శ్రీకారంచుట్టారు. బుధవారం మండలం లోని సమితి సింగారం పంచాయితీలోని 1వ వార్డులో సభ్యులు పర్య టించి కరోనా మహమ్మారిపై, సీజనల్ వ్యాధుల పై ప్రజలకు అవగాహనా కల్పించారు. 1వ వార్డు లోని చెత్త చెదారం, శుభ్రం చేయించి, బావుల్లో బ్లీచింగ్ వేయించడంతో పాటు అనేక పారిశుధ్య పనులు చేయించడం జరింగిదన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ,చికెన్ గున్యా, టైపాయిడ్, లాటి జ్వరాల భారిన పదకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిసరాల శుభ్రత ఎంతో అవసరం మన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి కెవి రావు, సర్పంచ్ బచ్చల భారతి, ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్, జావిడ్ పాషా, బేగం రమ్య, ఎంపీవో వెంకటేశ్వర రావు, కార్యదర్శి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
Post Top Ad
Thursday, July 23, 2020
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహనా కల్పించేందుకు ఎంపిపి కారం విజయ కుమారి శ్రీకారం
Admin Details
Subha Telangana News