తెలంగాణ పోలీసులకు నోటీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 15, 2020

తెలంగాణ పోలీసులకు నోటీసులు


సంగారెడ్డి, జూలై 14(శుభ తెలంగాణ): మహిళా ఉద్యోగి ఆత్మహత్య కేసులో తెలంగాణ పోలీసులకు, సీవీఐ అధికారులతో పాటు బీహెచ్‌ఈఎల్‌ యాజమాన్యానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. గతేడాది అక్టోబర్‌ లో బీహెచ్‌ ఈఎల్‌లో ఉన్నతస్థాయి అధికారుల వేధింపుల కారణంగా నేహా చౌస్కి అనే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగ సంస్థలో పై అధికారుల వేధింపుల కారణంగానే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నేహా సుసైడ్‌ నోట్‌లో రాశారు. ఈ క్రమంలో కూతురు ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరుతూ నేహా తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆదేశించారు. ఈ నేపథ్యంలో సుసైడ్‌నోట్‌లో ఉన్న ఎనిమిది మందిని మియాపూర్‌ పోలీసులు ఎందుకు విచారణ జరపలేదని అత్యు న్నత ధర్మాసనం జారీ చేసిన నోటీసులో పేర్కొంది. అదే విధంగా లేఖలో ఉన్న బీహెచ్‌ఈఎల్‌ అధికారులు, ఇతర ఉద్యోగులపై కూడా యాజ మాన్యం ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళపై అధికారుల వేధింపులపై ఫిర్యాదు అందినా సీబీఐ ఎందుకు స్పందించ లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.