నకిలీ విలేఖరులు పదం వాడడానికి వీలులేదు : వి.సుధాకర్‌, జాతీయ అధ్యక్షులు, ప్రింట్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ మీడియా - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 11, 2020

నకిలీ విలేఖరులు పదం వాడడానికి వీలులేదు : వి.సుధాకర్‌, జాతీయ అధ్యక్షులు, ప్రింట్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ మీడియా


హైదరాబాద్‌ ప్రతినిధి, జూలై 10(శభ తెలంగాణ): “నకిలీ విలేకరులు" అసలు ఈ పదం వాడడానికి వీలు లేదు. ఎందుకంటే విలేకరులు అనేది ఒక ప్రోడక్ట్‌(వస్తువు) కాదు. నకిలీ అంటే ఒక పేరుని కానీ, ఒక కంపెనీని కానీ, ఒక బ్రాండ్‌ ని కానీ తనది కానప్పుడు ఆ 'పేరుతో యాజమాన్యం అనుమతి లేకుండా చలామణి అయితే అది నకిలీగా గుర్తింపబడుతుంది. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో అందరికీ భావ ప్రకటన, వ్యక్తిగత 'స్వేచ్ళ కల్పించింది. ప్రతివ్యక్తి విలేకరి (జర్నలిస్ట్‌) కాకపోయినా ప్రతి సమాచారాన్ని పొందే హక్కు కల్గియున్నాడు. అంతే కాకుండా అతని భావ ప్రకటన ప్రసార మాధ్యమాల్లో కానీ, కరపత్రాల ద్వారా కానీ తెలియపరిచే హక్కు ప్రతి వ్యక్తికీ ఉంది. దీంతో పాటు ఆర్టీఐ యాక్ట్‌ ప్రకారం కూడా సమాచార సేకరణ హక్కు అంద రికి ఉంది. సమాచారం సేకరించ దానికి రిపోర్టర్‌ కావాల్సిన అవస రం లేదు. 
యూట్యూబ్‌ ఛానల్స్‌:
గత కొద్ది కాలంగా యూట్యూబ్‌ ఛానల్స్‌ ప్రముఖ పాత్ర వహిస్తు న్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వెబ్సైట్స్‌ ఉ దాహరణకు విక్మీలిక్స్‌ వెబ్‌సైట్‌ ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఇండియా లో పెద్ద పెద్ద ఛానల్స్‌ తమ కంపెనీ కి సంబంధించి వెబ్‌ సైట్స్‌, యూట్యూబ్‌ ఛానల్స్‌ మీదే ఆధారపడి వ్యూస్‌ పెంచుకుంటు న్నాయి. ఈ దశలో యూట్యూబ్‌ ఛానల్స్‌ నిషేధించినట్లు వస్తున్న వార్తలు కేవలం కొంతమంది. ఛానల్స్‌ రిపోర్టర్లకు యూట్యూబ్‌,కేబుల్‌ ఛానల్స్‌ రిపోర్టర్లు వారి ఆర్థిక ఆదాయాలకు,అధిపత్యానికి అడ్డంకులుగా మారడం వల్లే ఈ దుష్ప్రచారాన్ని మొదలు పెట్టారు. కొన్ని ఛానల్స్‌ ప్రతినిధులు, రిపోర్టర్లు కూటమిగా ఏర్పడి రాజకీయ నాయకుల అవినీతి అక్రమార్కులకు అండగా నిలబడుతూ వారి అవినీతి అక్రమాలు వెలుగులోకి రాకుండా దోహద పడుతుండడాన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌,కేబుల్‌ ఛానల్స్‌ రిపోర్టర్లు గండి కొట్టడం వల్లే యూట్యూబ్‌ ఛానల్స్‌ రిపోర్టర్లపై గుర్రుగా ఉంటున్నారు. గతంలో మాదిరి వార్తలను, అవినీతి అక్రమాలను తొక్కిపెట్టి వెలుగులోకి రాకుండా చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. యూట్యూబ్‌ ఛానల్స్‌ కేబుల్‌ ఛానల్స్‌ వల్లనే ప్రతీ విషయం, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత వరకు ఇండియాలో యూట్యూబ్‌ ఛానల్‌ గానీ,కేబుల్‌ ఛానల్‌ గానీ వెబ్‌ సైట్లను కానీ నిషేధించినట్లుa అధికారిక జి.ఓ గానీ ప్రభుత్వ ప్రకటన కానీ లేదు. తమకు అద్దుగా ఉన్న యూట్యూబ్‌ ఛానల్స్‌ రిపోర్టర్లను భయపెట్టడానికే కొంతమంది ఛానల్‌ రిపోర్టర్లు నకిలీ విలేకరులు అనే పేరుతో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ ఫిర్యాదులపై బ్లాక్‌ మెయిలింగ్‌ కి పాల్పడనంత వరకు యూట్యూబ్‌ మరియు కేబుల్‌ ఛానల్స్‌ రిపోర్టర్లు భయపడాల్సిన అవసరం లేదు. ఏదయినా మనకు కంపెనీ ఇచ్చిన గుర్తింపు కార్డుతో న్యూస్‌ కవరేజీ కోసం ఎలాంటి ప్రభుత్వ, పోలీసు అనుమతి అవసరం లేదని రాజ్యాంగం కల్పించిన సమాచార సేకరణ హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి కలదని గుర్తించగలరు.