న్యూఢిల్లీ,జూలై14 : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వారం కరోనా కేసుల్లో భారత్ 10 లక్షలు దాటుతుందని ఆయన ట్వీట్ చేశారు. సరైన చర్యలు తీసుకోకపోతే, ప్రపంచంలోని కరోనావైరస్ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ వెల్లడించిన ఓ నివేదికను రాహుల్ గాంధీ ట్యాగ్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనావైరస్పై ఇచ్చిన సమాచా రాన్ని ఉన్నది ఉన్నట్లుగా కాకుండా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని విమర్శించారు. కేంద్రఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఒక రోజులో 28,498తాజా కేసులు నమోదయ్యాయి, భారత్లో కోవిడ్ -19 కేసుల సంఖ్య మంగళవారం తొమ్మిది లక్షలు దాటింది, కేవలం మూడు రోజుల్లోనే ఎనిమిది లక్షలను దాటిందని రాహుల్ వెల్లడించారు. కరోనా తో పోరాడేం దుకు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల పై రాహుల్ పలు ప్రశ్నాస్తాలు సంధించారు. వైరస్ కట్టడిలో భారతదేశం 'ఎటువంటి స్థితిలో ఉందని ప్రభుత్వం పై రాహుల్ విమర్శలు గుప్పించారు.