రికార్డుస్థాయిలో కరోనాకేసులతో తెలంగాణా విలవిల .. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 03, 2020

రికార్డుస్థాయిలో కరోనాకేసులతో తెలంగాణా విలవిల ..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది కానీ ప్రభుత్వం కరోనా కట్టడిలో తీవ్రంగా విఫలమవుతోంది. ఇప్పటికీ సీఎం కేసీఆర్ కరోనాపై ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధ స్థితిలో ఉన్నారు. కరోనా పరీక్షల నిర్వహణ సైతం రోజురోజుకు గందరగోళంగా మారుతుంది. హైకోర్టు విచారణలో కరోనా నియంత్రణా చర్యల విషయంలో ప్రభుత్వ తీరుపై మండిపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరుగుతున్నా ,టెస్టులు చేయలేమని చేతులెత్తేస్తున్న ప్రభుత్వ తీరు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పై ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది.
మొన్నటికి మొన్న హైకోర్టు ప్రభుత్వం ధిక్కరణకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యవహారాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు వేసినా సరే తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనా వ్యవహారంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒక్కరోజులోనే ప్రైవేట్ ల్యాబ్ లలో పరీక్షలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ ల్యాబ్ లలో వైద్య ఆరోగ్య శాఖ జరిపిన పరీక్షల్లో లోపాలు బయటపడ్డాయని ఈ వాటన్నింటిని నాలుగు రోజుల్లో సరిచేసి, ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ లు చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది .