ఖమ్మం,జూలై14(శుభ తెలంగాణ): ఖమ్మంజిల్లాలో కరోనాపాజిటవ్ వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు మూడు కొవిడ్ కేర్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కలెక్టర్ కర్ణన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ (హెచ్‌డీఎస్) ఆమోదం తెలిపింది.అయితే జిల్లాలో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో ప్రాం తాల వారీగా కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు ఈ సమావేశంలో నిర్ణయించారు. సత్తుపల్లి పరిసర ప్రాంతాల వారికి 'పెనుబల్లిలో, కూసుమంచి పరిసర మండలాల వారికి ఖమ్మంరూరల్ మండలం మద్దులపల్లిలోని యూత్ శిక్షణా కేంద్రంలో, తిరుమలాయ పాలెం సమిప ప్రాంతాల వారికి తిరుమలాయపాలెంలో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాగే హోం ఐసోలేషన్ కిట్స్‌కు కావాల్సిన వస్తువులు,మందులుకొనుగోలుకు అనుమతి ఇచ్చారు.