గ్రీన్ ఛాలేంజ్లో భాగంగా మొక్కలు నాటిన చీఫ్ విప్ రేగా - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 26, 2020

గ్రీన్ ఛాలేంజ్లో భాగంగా మొక్కలు నాటిన చీఫ్ విప్ రేగా


పినపాక (శుభ తెలంగాణ) రాజ్యసభ సభ్యులు ఎంపీ టిఆర్ ఎన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగిన వల్లి నంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండి యా ఛాలెంజ్ 3వ విడత లో భాగంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గడ్డంవల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విష్, పినపాక శాసనసభ్యు లు రేగాకాంతారావు మొక్కలు నాటారు. ఈసందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి అందరితో మొక్కలు నాటించడం చాలా సంతోషకరం అని దీనిని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటాలని భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యాన్ని, పకృతి పరంగా స్వచ్ఛమైన వాతావరణ కాలుష్యం ఆకుపచ్చభారతదేశాన్ని అందించడం కోసం తోడ్పడుతుందని పేర్కొన్నారు