ఎల్లమ్మ బండలో రాపిడ్ టెస్ట్ కిట్ పరీక్షలు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 10, 2020

ఎల్లమ్మ బండలో రాపిడ్ టెస్ట్ కిట్ పరీక్షలు


కూకట్‌ పల్లి సర్కిల్‌ ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ ఎల్లమ్మ బండ ప్రభుత్వ ఆస్పత్రిలో నేడు కోవిడ్‌-19 కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయం లో ఎల్లమ్మ బండ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు 20 మంది గర్భిణీ స్రీలకు, 20 మంది ప్రజలకు కోవిడ్‌ 19 రాపిడ్‌ కిట్‌ పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌గౌడ్‌ మాట్లాడు తూ కోవిడ్‌ 19 రాపిడ్‌ కిట్‌ కేంద్రాన్ని ఎల్లమ్మ బండ ప్రారంభించినం దుకు ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌ గౌడ్‌ స్వయంగా విచ్చేసి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పరీక్షలు జరిపించుకోవడం మరియు దాక్టర్‌ ప్రవీణ్‌ తో ఈ పరీక్ష వివరాలు అడగాగ డాక్టర్‌ రాపిడ్‌ కిట్‌ వల్ల అరగంటలో ఫలితాలు వెలువడుతాయి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలొ తెరాస డివిజన్‌ అధ్యక్షులు జిల్లా గణేష్‌ వార్డ్‌ మెంబర్‌ కాశీనాథ్‌ యాదవ్‌, పోషెట్టి గౌడ్‌, బోయ కిషన్‌, మున్న తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad