వారబందీ పద్దతిలో నీటి విడుదల : అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 25, 2020

వారబందీ పద్దతిలో నీటి విడుదల : అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి


నిర్మల్,జూలై 24(శుభ తెలంగాణ): వానకాలం పంటలకై వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నామని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి శుక్రవారం సరస్వతి కాలువకు నీటిని విడుదల చేశారు పూజలు చేసి నీళ్లు వదిలారు. పోచంపహాడ్ వద్ద ప్రత్యేక పూజలు చేసి, స్విచ్ నొక్కి మంత్రి కాలువ నీళ్లను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 35 వేల ఎకరాలకు పైగా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తామని పేర్కొన్నారు రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సరస్వతి కెనాల్ నీటితో చెర్లను కూడా నింపు కోవాలని మంత్రి రైతులకు సూచించారు