కాంగ్రెస్‌ పార్టీ ద్వంద వైఖరి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 28, 2020

కాంగ్రెస్‌ పార్టీ ద్వంద వైఖరి


హైదరాబాద్‌, జూలై28(శభ తెలంగాణ) : కాంగ్రెస్‌ పార్టీ ద్వంద వైఖరి మరోసారి బయటపడిందని ప్రభుత్వ విప్‌ కర్నెప్రభాకర్‌ అన్నారు. జాతీయ పార్టీ అని చెప్పుకునే వారు రాష్ట్రానికో విధంగా మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉత్తమ్‌ కాంగ్రెస్‌, రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లెట్‌ కాంగ్రెస్‌లా వ్యవహరి స్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలో వున్నప్పుడు. గవర్నర్‌ను అర్జుపెట్టుకొని... అం. ళ్‌ ప్రభుత్వాలను కూల దోయలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు బీజేపీ చేసినా, అప్పట్లో కాంగ్రెస్‌ చేసినా మా వైఖరి ఒకేలా వుంటుందన్నారు. ఇలాంటి వ్యవహారాలకు మేము వ్యతిరేకమని ..కాంగ్రెన్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏంచేశారో ఆ పార్టీ నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ వచ్చాక మా, ఎమ్మెల్యేల ను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని కాంగ్రెస్‌ ప్రయత్నాలు, చేయలేదా అని అన్నారు. సెక్షన్‌ 8అమలు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేయ లేదా... రాజస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిం దని అంటున్న నేతలు... ఇక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని అడగలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన పెట్టాలని అడిగిన కాంగ్రెస్‌ నాయకులకు. మోకు రాజస్థాన్‌లో ఒకన్యాయం, ఇక్కడ ఒక న్యాయం కావాలా. అని కర్ని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తీరు దారుణంగా ఉందన్నారు.