నితిన్ హీరోగా రూపొందిన 'రంగ్ దే' చిత్రాన్ని రాబోయే దసరాకు ప్రేక్షకుల ముందుకు...? - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, July 20, 2020

నితిన్ హీరోగా రూపొందిన 'రంగ్ దే' చిత్రాన్ని రాబోయే దసరాకు ప్రేక్షకుల ముందుకు...?


కరోనా వల్ల నాలుగు నెలల క్రితం మూత పడ్డ థియేటర్లు ఆగస్టు నుండి ఓపెన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆగస్టులో కాకున్నా సెప్టెంబర్ వరకు అయినా పాక్షికంగా థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆగస్టు లేదా సెప్టెంబర్ లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని బలంగా అంతా నమ్ముతున్నారు. అందుకే సినిమాల విడుదల సందడి మళ్లీ ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే ముందస్తుగా ప్రకటనలు చేస్తున్నారు.నితిన్ హీరోగా రూపొందిన 'రంగ్ దే' చిత్రాన్ని రాబోయే దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. దసరా వరకు పరిస్థితులు కుదుట పడతాయని ఖచ్చితంగా దసరాకు తీసుకు రావాలని చాలా కాలం గ్యాప్ తర్వాత సినిమాలు విడుదల అయ్యాయి కనుక ప్రేక్షకులు ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందనే నమ్మకంతో 'రంగ్ దే' మేకర్స్ ఉన్నారట. అందుకే దసరాకు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో నితిన్ భీష్మ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక రంగ్ దే చిత్రాన్ని జులై నెలలో విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా షూటింగ్ జరగలేదు.. థియేటర్లు కూడా లేవు. కనుక సినిమాను దసరాకు విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట. కీర్తి సురేష్ ఈ చిత్రంలో నితిన్ కు జోడీగా నటిస్తోంది. ఈ నెలలో నితిన్ పెళ్లి ఉంది. పెళ్లి తర్వాత రంగ్ దే బ్యాలన్స్ వర్క్ పూర్తి చేయబోతున్నాడు. దసరా వరకు సినిమాను విడుదలకు సిద్దం చేయాలని దర్శకుడు వెంకీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.  
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )