కార్పోరేట్ కరోనా దందా పై ... ఎ౦దుకీ ఉదాసీనత! - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 21, 2020

కార్పోరేట్ కరోనా దందా పై ... ఎ౦దుకీ ఉదాసీనత!


హైదరాబాద్‌, జూలై21(శుభ తెలంగాణ): కరోనాపై తీవ్ర ఆరోపణలు ఉన్నా ఇష్టి వరకు ఒక్క ప్రైవేట్‌ ఆస్పత్రి మోద కూడా ఇంత వరకు కేసు పెట్టలేదు. స్పెయిన్‌ వంటి దేశా ల్లో ప్రైవేటు ఆస్పత్రులనన్నిటినీ ప్రభుత్వాలు తాత్కాలికంగా స్వాధీ | నం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈ విషయంలో మెరుగు గా ఉన్నది. ప్రైవేటు వైద్యసంస్థల ను ఎంతో కొంత అదుపు చేస్తు న్నది. అత్యవసర సమయంలో వచ్చిన పేషెంటును తిరస్మరించ దానికి వీలులేదు. వైద్యుల ప్రవర్త నా నియమావళి కూడా అందుకు అంగీకరించదు. ఆ అస్పత్రిలో పడకలు లభ్యం కాకున్నా అత్యవ సర విభాగంలో తాత్మాలిక చికిత్స చేసిపడకలు అదుబాటులో ఉన్న ఆస్పత్రికి పేషెంటును పంపాలి. ప్రైవేటు ఆస్పత్రుల మిద భ్రమతో, ప్రాణభయంతో వెడుతున్న పేషెం ట్లకు తగిన ఆశ్వాసన ఇచ్చే వ్యవస్థ ఉండాలి. అత్యవసర సమయాల్లో వ్యవహరించ వలసిన తీరు గురిం చి ప్రచారం ముమ్మరంగా జరగా లి. చికిత్సకు లక్షలాది రూపాయల బిల్లు ఎందుకు అవుతుందో అడిగే వారు లేరు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్కో రోగికి అవుతున్న ఖర్చును ప్రాతిపదికగా తీసుకుని ఫీజులు నిర్ణయించి, కఠినంగా అమలు చేయవలసిన ప్రభుత్వం చేతులు ముడుచుకు కూర్చున్నది. కొన్ని ముఖ్య నగరాల్లో సరే,జిల్లా కేంద్రా లలోని ఆస్పత్రులలో పరి స్థితీ ఆశాజనకంగా లేదు. ఉభయ రాష్ట్రాల్లో ఈ అంశాల్లో అలక్ష్యమే కనిపిస్తున్నది. కరోనా నిరోధానికి ముఖానికి ముసుగులు ధరించ డం తప్పనిసరి అని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ఆలస్యంగానైనా నిబం ధన విధించి, అమలుచేస్తున్న ది. తెలంగాణ ప్రభుత్వం ముసుగులు ధరించనివారికి వెయ్యి జరిమానా అని ఎప్పుడో ప్రకటించినా, ఆచ రణ మాత్రం శూన్యం. ఎటువంటి కట్టడులూ లేవు. బహిరంగ ప్రదే శాల్లో అయినా భౌతికదూరాన్ని పాటింపజేయడానికి ఎటువంటి యంత్రాంగమూ లేదు. ఆంధ్రప్ర దేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తున్నది. ఒకేరోజు నాలుగు వేల కేసులు రావడం, 50 మందికి పైగా చనిపోవడం ఆనవాయితీగా మారేట్టు కనిపిస్తున్నది. తెలంగాణ లోనూ భీతావహ పరిస్థితి కొనసా గుతూనే ఉన్నది. ఆదిలో ఎంతో ఆదర్శంగా కనిపించిన తెలంగాణ ప్రభుత్వం, లాక్‌డౌన్‌ సడలించే సమయం వచ్చే నాటికి, చేతులెత్తే సినట్టు కనిపించసాగింది. తగినన్ని పరీక్షలు చేయకపోవడం, పరీక్షా కేంద్రాలను పెంచకపోవడం, ప్రైవేటు చికిత్సను అనుమతించక పోవడం మొదట సమస్యలుగా ఉ డేవి. తమకు వ్యాధి సోకిందే మోనన్న అనుమానం ఉన్నవారికి వెంటనే స్పందన దొరకకపోవడం, వ్యాధి నిర్దారణ కానివారికి ప్రభు త్వ ఆస్పత్రిలో ప్రవేశం ఇవ్వక పోవడం, పైవేటులో అందుకు ఆస్కారం లేకపోవడం వల్ల ప్రజలలో ఆందోళన ఉండేది. ఇప్పుడు, పరీక్షల సంఖ్య పెంచారు. పరీక్షాకేంద్రాల సంఖ్యను కూడా పెంచారు. ప్రైవేటు చికిత్సను అనుమతిస్తున్నారు. అయినా, పరిస్థితి మెరుగుపడలేదు. పరీక్షల సంఖ్యను పెంచేనాటికి, వ్యాప్తి విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికీ రోజువారీగా జరుపుతున్న 15వేల పై చిలుకు పరీక్షలు, వాస్తవ స్థితిని ప్రతిబింబిస్తున్నాయా అన్నది అనుమానమే. మరణాల నివారణలో ప్రభుత్వాలు క్రియాశీలంగా చేస్తున్న కృషి ఏమి కనిపించడం లేదు. ప్రభుత్వాలు పరిస్థితిని గాలికి వదిలేసి కూర్చోక పోతే, ప్రజలలో విశ్వాసాన్ని కల్పించడం సాధ్యమే. పారదర్శకమైన సమాచారం, (ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను యుద్ధ ప్రాతిపదిక మిద మెరుగుపరచడం, ప్రైవేటు ఆస్పత్రుల మోద ప్రభుత్వ నియంత్రణ వంటి చర్యలు తీసుకొనగలిగితే, వాతావరణంలో ఇంత భయాందోళనలు, విషాదం నెలకొనేవి కావు.