తెలంగాణలో..డేంజర్‌బెల్స్‌! - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, July 10, 2020

తెలంగాణలో..డేంజర్‌బెల్స్‌!


హైదరాబాద్‌, జూలై 09(శుభ తెలంగాణ): ఇప్పటికే తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకోకుంటే వైరస్‌ మరిన్ని ప్రాంతాలకు వ్యాపించే ప్రమా దం దగ్గరలోనే ఉంది. వైరస్‌ మండల కేంద్రాలకు పల్లెలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. తెలంగాణలో పరీక్షలు తక్కువగా జరగడం వల్ల కేసుల సంఖ్య ఎంతన్నది తేలడం లేదు. ఇప్పటిదాకా హైదరాబాద్‌. నగరం దాని చుట్టుపక్కల రంగారెడ్డి, మేద్చల్‌, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో మాత్రమే కేసుల సంఖ్య పెరిగింది. కానీ కొన్ని రోజులుగా. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పట్టణా లైన నిజామాబాద్‌, వరంగల్‌, నగరాలలో కూడా కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. నగరాలు పట్టణాలలో మాత్రమే కాకుండా ఇక పల్లెలకు కూడా వ్యాధి విస్తరించే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మహారాష్ట్ర గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల తర్వాత కరోనా పాజిటివ్‌ కేనుల లలో... విషయం లో తెలంగాణ ఐదవ స్టానానికి చేరింది. కరోనా కట్టడి చర్యల్లో జాతీయ విధానం అవలంబించ కుండా బిజెపి రాజకీయాలు చేస్తోంది. దేశమంతా సుభిక్షంగా ఉన్నట్లు ఒక్క తెలంగాణాలోనే అంతా ఆగమైనట్లు ప్రవర్తిస్తుంది. కేంద్రం నుంచి రాష్రాలకు ఏదో దయాదాక్షిణ్యాలతో డబ్బులు ఇచ్చా మని కేంద్ర హోం మంత్రి కిషన్‌ రెడ్డి స్వయంగా ప్రకటించారు. సాయం చేస్తున్నా తెలంగాణ విఫలం అవుతుందన్న రీతిలో ప్రకటనలు గుప్పస్తున్నారు. ప్రజల కు కావాల్సింది విమర్శలు కాదు... ప్రజల ప్రాణాలను కాపాడడం ముఖ్యం అని పాలకులు గుర్తించా లి. ఇలాంటి సంక్షోభ సమయంలో రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమో. ఆలోచన చేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాదితే అభ్యంతరం లేదని మంత్రి కెటిఆర్‌ కూడా ఘటుగానే సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల రాజకీయాలకు సమయం కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉ మ్మడి బాధ్యతగా కరోనా మహమ్మారి ఎదుర్శొని ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదని, చూడకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు, ప్రారంభించాలి. ప్రజల ప్రాణాలు రక్షించని ప్రభుత్వాలు ఎందుకు అని ప్రజలు ప్రశ్నించకుండా చూదాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా వికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి తక్షణం అదేశాలు ఇస్తే ప్రజలకు భరోసా 'దక్కగలదు. కనుక ప్రజలు కూడా వ్యాక్సిన్‌ వచ్చేదాకా దాక్టర్లు చెప్పే సలహాలు పాటించి తగిన జాగ్రత్తలు తీసుకొని తమ తమ ఇళ్లకే పరిమితమై వైరస్‌ వ్యాప్తిని అరి కట్టాలి. పెరుగుతున్న కరోనా. కేసులతో భయపడుతున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు శుభవార్త అందించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కొవిడ్‌-19 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ టెస్టుల ద్వారా కేవలం అరగంటలోనే ఫలితం తెలుసుకోవచ్చు. ఒక్కో ఆరోగ్య కేంద్రం పరిధిలో 25 మందికి పరీక్షలు చేయనుండగా, తొలి రోజు మూడు జిల్లాల్లో ఆరేడు వందల మందికి పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ లో 50 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, రంగారెడ్డి జిల్లాలో 20, మేద్చల్‌లో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పరీక్షలు నిర్వహించనున్న ట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రివర్స్‌ ట్రాన్స్‌క్రిష్పన్‌ పొలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ-పీసీఆర్‌) విధానంలో కరోనా పరీక్షలు చేయగా, ఇప్పుడు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తు న్నారు. ఈ విధానంలో తొలిసారి పాజిటివ్‌ ఫలితం వస్తే రెండోసారి పరీక్షలు, చేయించుకోవాల్సిన అవసరం ఉ డదు. అయితే, నెగటివ్‌ వస్తే మాత్రం ఆర్‌టీ- పీసీఆర్‌ పరీక్ష చేయించుకుని ్రువీకరించు కోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు అందుబాటులో లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కేంద్రం కూడా చూస్తూ కూర్చోకుండా. తెలంగాణపై చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను రక్షించాలని కోరుతున్నారు.