కరోనా కట్టడికి అన్ని చర్యలు : పువ్వాడ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 21, 2020

కరోనా కట్టడికి అన్ని చర్యలు : పువ్వాడ


ఖమ్మం,జూలై 20(శుభ తెలంగాణ): కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లి గ్రామంలో గల గిరిజన యువత శిక్షణా కేంద్రం లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా విషయంలో ఎవరు భయాందోళనకు గురికావాల్సిన పనిలేదన్నారు. ప్రభుత్వ దవాఖాన కాకుండా అదనంగా ఇక్కడ 70, మమత దవాఖానలో 130 బెడ్డు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శారద ఇంజినీరింగ్‌ కళాశాలలో కూడా కొవిడ్‌ హెల్త్‌ కేర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అసత్య ప్రచారాలు నమ్మవద్దని, తెలంగాణలో కరోనా బారిన పడిన మరణాలు 11.5 శాతం మాత్రమే అని వెల్లడించారు.