హైదరాబాద్ కరోనా కేసుల్లో కొత్త లక్షణాలు... ఒకింత కన్ఫ్యూజన్... అసలేం జరుగుతోంది.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 05, 2020

హైదరాబాద్ కరోనా కేసుల్లో కొత్త లక్షణాలు... ఒకింత కన్ఫ్యూజన్... అసలేం జరుగుతోంది..


  • హైదరాబాద్‌లోని కోవిడ్ 19 ఆస్పత్రులకు వస్తున్న కొంతమంది పేషెంట్లలో కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. డయేరియా(విరేచనాలు),వాంతులు,తలనొప్పితో వస్తున్న పేషెంట్లలోనూ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే సాధారణంగా సీజన్ మారినప్పుడు కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి కాబట్టి... ఏవి సాధారణ లక్షణాలో... ఏవి కోవిడ్ 19 లక్షణాలో వెంటనే నిర్దారించడం కష్టంగా మారింది. దీంతో కొత్త కేసుల విషయంలో కాస్త కన్ఫ్యూజన్ నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హైదరాబాద్‌లోని చెస్ట్ ఆస్పత్రి,కింగ్ కోఠి ఆస్పత్రుల వైద్యులు చెబుతున్న ప్రకారం... తీవ్ర విరేచనాలు,వాంతులు,తలనొప్పితో వస్తున్నవారికి డయాగ్నోసిస్ ఆలస్యం అవుతోంది. దీంతో ట్రీట్‌మెంట్‌లోనూ జాప్యం జరుగుతోంది. కొత్త లక్షణాలతో వస్తున్నవారికి టెస్టులు,చికిత్సను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలతో వస్తున్నవారిలో దగ్గు,జ్వరం,శ్వాసకోశ సమస్యలు కనిపించట్లేదని.. దీంతో వారికి కోవిడ్ 19 సోకిందా లేదా అన్నది తేలే ప్రక్రియలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు.