మణిపురం గోల్డ్‌ లోను.. ఖాతాదారులు ఆదర్యపదొద్దు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 28, 2020

మణిపురం గోల్డ్‌ లోను.. ఖాతాదారులు ఆదర్యపదొద్దు..


మణుగూరు, జులై 28 (శుభ తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణ పరిధిలోని సోమవారం రాత్రి మణిపురం గోల్డ్‌ బ్రాంచి అర్‌.ఎం, జియంలు కార్యాలయం వద్దకు వచ్చి గోల్డ్‌లోన్‌ ఖాతాదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. సంబంధిత రీజనల్‌ మేనేజర్‌, జోనల్‌ మేనేజర్‌ కనపడగానే ఖాతాదారులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసు అధికారులు జోక్యం చేసుకొని ఖాతాదారులతో, కార్యాలయఓనర్‌తో మాట్లాడి సర్ది చెప్పడంతో అంతా సద్దు మణిగింది. అర్‌ఎం,జియంలు మాట్లాడుతూ అద్దె విషయం లో ఆఫిస్‌ తెరవడం కొంత జాప్యం జరిగిందని, రెండు రోజుల్లో కార్యాల యం తెరుస్తామని, లేకుంటే ఇదే ప్రాంతంలో వేరేచోటకు కార్యాలయం తరలిస్తామని వినియోగదారులకు తెలిపారు.