'బొనాల పండగతో.. మద్యం దుకాణాల మూసివేత" : నేటి నుంచి సోమవారం ఉదయం వరకు బంద్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, July 12, 2020

'బొనాల పండగతో.. మద్యం దుకాణాల మూసివేత" : నేటి నుంచి సోమవారం ఉదయం వరకు బంద్‌


హైదరాబాద్‌,జూలై 11(శుభ తెలంగాణ): బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో నార్త్‌, సెంట్రల్‌ జోన్‌లో మద్యం అమ్మకాలను బంద్‌ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపుల మూసివేయాలని షాపుల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉ న్నతాధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించి మద్యం షాపులు తెరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరపడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు చెబు తున్నారు. కాగా.. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం అమ్మ కాలను నిలిపివేయడం జరిగింది. బోనాలను బహిరంగంగా జరుపు కోవడాన్ని నిషేధించి ఇంటికే పరిమితం కావాలన్నారు. దీంతో మద్యాం షాపుల పైనా ఆంక్షలు విధించారు. ఏటా మద్యం దుకాణాలను మూసే యడం ఆనవాయితీగా వస్తోంది.