కేంద్రం కుట్ర... నష్టపోనున్న ప్రజలు... గతంలోనే మోదీకి కేసీఆర్ లేఖ... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 04, 2020

కేంద్రం కుట్ర... నష్టపోనున్న ప్రజలు... గతంలోనే మోదీకి కేసీఆర్ లేఖ...


కేంద్రం తీసుకురాబోతున్న విద్యుత్ స‌వ‌ర‌ణ చ‌ట్ట బిల్లుతో రాష్ట్రాల హక్కుకు తీవ్ర భంగం కలుగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రాల హక్కులను ప్రైవేట్ పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. విద్యుత్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుతో అత్యవసర సర్వీసును ప్రైవేట్‌ పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి జాతీయ స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సదస్సులో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై కేంద్ర విద్యుత్ శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరారు. ఈ బిల్లు ప్రజా వ్యతిరేకమని గతంలోనే సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనివల్ల రాష్ట్రానికి,ప్రజలకూ ఉపయోగం లేదని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. తాజా బిల్లుతో రైతాంగానికి,సబ్సిడీలు పొందే గృహ వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. చిన్న చిన్న వినియోగదారులు కూడా సబ్సిడీలను కోల్పోతారు. కాబట్టి విద్యుత్ బిల్లును వ్యతిరేకించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.' అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.