ట్రాఫిక్‌ విధుల్లో చేరిన సిబ్బందికి సిపి అంజనీకుమార్‌ అభినందన - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 14, 2020

ట్రాఫిక్‌ విధుల్లో చేరిన సిబ్బందికి సిపి అంజనీకుమార్‌ అభినందన


హైదరాబాద్‌,జూలై18(శుభ తెలంగాణ):కోవిడ్‌-19 బారిన పడి కోలు కున్న 31 మంది ట్రాఫిక్‌ పోలీసులు విధుల్లోకి చేరారు. కరోనా బారిన పడి కోలుకున్న 31 మంది ట్రాఫిక్‌ పోలీసులను సీపీ అంజనీ కుమార్‌ సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రొఫెషనల్‌ పోలీస్‌ లైఫ్‌లో ఇంత కష్టతరమైన పరిస్థితి రావడం... దానిని పోలీస్‌ సిబ్బంది అధిగమించడం సంతోషమన్నారు. లాక్‌డౌన్‌, నియంత్రణ ప్రదేశాలు, వలస కూలీల తరలింపులో పోలీసులు ఎంతో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కరోనా ప్రబలి పోయిందని,ఈ విపత్మర పరిస్థితుల్లో పోలీసులు ముందు వుంది ప్రజలకు సేవ చేయడం హర్షణీయమని అంజనీకుమార్‌ తెలిపారు.