పల్లె ప్రకృతి పార్క్‌ను ప్రారంభించి... మొక్కలు నాటిన అధికారులు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 21, 2020

పల్లె ప్రకృతి పార్క్‌ను ప్రారంభించి... మొక్కలు నాటిన అధికారులు..


సంగారెడ్డి జిల్లా(శుభ తెలంగాణ) : పటాన్ చెరువు  నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పల్లెలో ఏర్పాటు చేస్తున్న పార్క్‌ లు ఆహ్లాదకరంగా ఉంటున్నాయని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. హూన్‌చెరు మండలం కర్దనూర్‌లో పల్లె ప్రకృతి పార్క్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు పచ్చని చెట్లు, ఆహ్హదకర వాతావరణంలో విలసిల్లాలన్నారు. అనం తరం హరితహారంలో భాగంగా మొక్కనునాటి నీళ్లు పోశారు. కార్య క్రమంలో పటాన్‌ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, కలెక్టర్‌ హనుమంత రావు, ప్రజా ప్రతినిధులు, అదికారులు పాల్గొన్నారు.