కోర్టులు పూర్తిస్థాయిలో పని చెయ్యాలి : కోర్టు ముందు నిరసన తెలుపుతున్న లాయర్లు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 18, 2020

కోర్టులు పూర్తిస్థాయిలో పని చెయ్యాలి : కోర్టు ముందు నిరసన తెలుపుతున్న లాయర్లు


మణుగూరు, (శుభతెలంగాణ) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో న్యాయ దినోత్సవం సందర్భంగా ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూని యన్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మణుగూరు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు ప్ల కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కార్యదర్భులు చోక్కయ్య, విజయ్‌ మాట్లాడుతూకరోనా నేపథ్యంలో గతనాలుగు నెలలుగా కోర్టులు పూర్తిస్థాయిలో పనిచేయక పోవడతో లాయర్లుకు కేసులు లేక, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అన్ని వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు పూర్తిస్థాయి లోపని చేస్తున్నా కోర్టులు మాత్రం పని చేయడం లేదన్నారు. కోర్టులను కూడా వారు పూర్తిస్థాయిలో నడిపించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్య క్రమంలో న్యాయవాదులు కిషన్‌రావు,కందిమల్ల నరసింహారావు, రామా రావు, మేదరమెట్ల శ్రీనివాసరావు, అశోక్‌, సంధ్య, శ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.