సిరిసిల్ల జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 02, 2020

సిరిసిల్ల జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్

కరోనా పాజిటివ్ కేసులు జిల్లాలో గుబులు పుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న జిల్లాలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఈ ఒక్క రోజే జిల్లాలో ఆరుగురికి పాజిటివ్ గా తేలడంతో ఆందోళన నెలకొంది. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ కు చెందిన ఇద్దరికి, బై పాస్ రోడ్డు కు చెందిన ఒకరికి, వేములవాడ పట్టణానికి చెందిన ఇద్దరికి, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన ఒకరికి  కరోనా పాజిటివ్ గా అని నిర్ధారణ అయింది. కాగా, ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు.